”అ..ఆ ” పైరసీ వచ్చిందా…?

A-Aa-Piracyత్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్, సమంత , అనుపమ జంటగా తెరకెక్కిన ‘అ..ఆ ‘ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది..ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న టీం కు ఓ షాకింగ్ న్యూస్ విని ఖంగారు పడుతున్నారు..నిన్న ఈ చిత్ర పైరసీ ఆన్లైన్ లో కనిపించడం తో ఖంగారు పడ్డారు..

”అ..ఆ ” చిత్రాన్ని యుఎస్ లో చూస్తున్న ఓ స్టూడెంట్ నేరుగా దాన్ని పైరసీ చేసి పేస్ బుక్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండటం తో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేసారు. చిత్రాన్ని చూస్తూ పేస్ బుక్ ద్వారా ఆ వీడియో అంతా పెట్టడంతో హైదరాబాద్ లోని యాంటీ పైరసీ సెల్ త్వరగా స్పందించి అక్కడి థియేటర్ యాజమాన్యాన్ని అప్రమత్తం చేసింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు సదరు స్టూడెంట్ ని అరెస్ట్ చేసారు . ఇక సినిమా కొంత భాగమే పైరసీ అయునప్పటికి ఆ లింక్ లన్నీ ఏవి లేకుండా డిలీట్ చేసారు .