నవ్విస్తూ భయపెట్టిన త్రిష

trisha (2)ప్రస్తుతం హారర్ కామెడీల ట్రెండ్ కొనసాగుతోంది. ఈ జోనర్ క్లిక్ అయితే కాసుల పంటే. అందుకే ఈ టైపు కధలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు మరో హారర్ కామెడి సిద్దమైయింది. అదే నాయకి. త్రిష లీడ్ రోల్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. జోనర్ తగ్గట్టే సాగిందీ ట్రైలర్. ఓ ఇల్లు… అక్క‌డ ఓదెయ్యం , ఆ దెయ్యానికి ఓ ఫ్లాష్ బ్యాక్‌.. మధ్యలో ఆ దెయ్యాన్ని చూసి వునికిపోయే మనుషులు.. ఈ గ్యాప్ లో కామెడి.. ఇదీ ట్రైలర్. ట్రైలర్ కామన్ గానే వున్నా.. అందులో త్రిష వుండడం ఆసక్తిని రేపుతోంది. మరి, ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.