దిల్‌ రాజు ప్రేమలో పడ్డాడు..

dilrajupremalopaddadu’దిల్ రాజు ప్రేమలో పడ్డాడు’ టైటిల్ చూసి నిర్మాత దిల్ రాజు ప్రేమలో పడ్డాడు అనుకునేరూ.. ! ఇది ఓ సినిమా టైటిల్. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాజు దర్శకుడు. బేబి ఆరాధ్య ప్రొడక్షన్‌ లో ఈ చిత్రం రూపుదిద్దుకొంది. ఈ టైటిల్ ను చూసి నిర్మాత దిల్ రాజు నిజంగా ప్రేమలో పడ్డాడని అందరూ అనుకుంటున్నారు. దిల్ రాజు కూతురుకి ఇటీవలే వివాహం జరిగింది. అలాంటిది దిల్ రాజు ప్రేమలో పడటమేంటని ఆరా.. తీస్తే అసలు విషయం వెలుగులోనికి వచ్చింది. ఈ చిత్రంలో తెలంగాణ అమ్మాయి పూజ హీరోయిన్ గా నటించింది. వనపర్తికి చెందిన పూజ చేసిన తొలి చిత్రమిది. మరీ.. దిల్ రాజు ప్రేమను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాలి..