దిల్ రాజు చేతికి పోయిందంటే సినిమా హిటే…

Dil-Raju-Dictator-Nizam-Rigబాలకృష్ణ – శ్రీవాస్ కాంబినేషన్ లో రాబోతున్న డిక్టేటర్ ఫై నందమూరి ఫాన్స్ లలో భారీ అంచనాలు ఉన్నాయి..ఆ అంచనాలు తగ్గట్టే సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడని చిత్ర యూనిట్ తెలుపుతుంది..అలాగే సంక్రాంతి బరిలోకి సినిమా రావడం తో చిత్ర బిజినెస్ కూడా ఓ రేంజ్ లో ఉంది..తాజాగా ఈ చిత్ర నైజం రైట్స్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ & డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీ మొత్తానికి తీసుకున్నారు.

టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ ఉంది దిల్ రాజు ఏ సినిమా అయిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ తీసుకున్నడంటే ఆ చిత్రం సూపర్ హిట్ అని అందరు నమ్ముతారు..ఇప్పుడు డిక్టేటర్ రైట్స్ తీసుకోవడం తో ఫాన్స్ అంత హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు..అలాగే సినిమా ని కూడా నైజం లో అత్యధిక థియేటర్స్ లలో రిలీజ్ చెయ్యాలని రాజు ప్లాన్ చేస్తున్నాడు.

బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటించగా , కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి కథని అందించారు. తమన్ మ్యూజిక్ అందించాడు.