రివ్యూ : ‘సౌఖ్యం ‘ గా బయటకు రాలేరు….

టైటిల్ : సౌఖ్యం (2015)
స్టార్ కాస్ట్ : గోపీచంద్ , రెజిన
దర్శకత్వం : కెఎస్ రవికుమార్ చౌదరి
ప్రొడ్యూసర్ : వి.ఆనంద్ ప్రసాద్
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్
విడుదల తేది : డిసెంబర్ 24, 2015
తెలుగు మిర్చి రేటింగ్ : 2/5

Soukhyam-Telugu-Review

జిల్ , లౌక్యం చిత్రాలతో మరోసారి ప్రేక్షకులకు దగ్గరయిన గోపీచంద్ ఈ సారి సౌఖ్యం అనే చిత్రం తో ఈరోజు థియేటర్స్ లోకి వచ్చాడు..గత రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో సాదారణ ప్రేక్షకుడు కూడా ఈ సినిమా బాగుంటుందని అంచనా వేసాడు..మరి ఆ అంచనాలను సౌఖ్యం ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

బాగా డబ్బున్న ఫ్యామిలీ చెందినా శ్రీను ( గోపీచంద్ )..ఫ్రెండ్స్ ఖాళీగా తీరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు..ఓ రోజు తిరుపతి వెళ్ళుతున్న ఇతడికి శైలజ( రెజీన) కనిపిస్తుంది..చూసిన మొదటిచుపులోనే ఆమె ప్రేమలో పడిపోతాడు..కానీ ఆమె మాత్రం శీను ని పట్టించుకోవడం మానేస్తుంది..అయిన కానీ మనోడు ఆమె ప్రేమను పొందడానికి తెగ ట్రై చేస్తుంటాడు..చివరికి ఆమె శ్రీను లవ్ కు ఒకే చెపుతుంది..

అదే టైం లో శైలజ ను కొందఱు రౌడీ లు కిడ్నాప్ చేస్తారు..గొడవలకు దూరంగా ఉండే శ్రీను , శైలజ కోసం వెతకడం మానేస్తాడు..అదే టైం శ్రీను చంపడానికి ట్రై చేస్తాడు రౌడీషీటర్ బాబ్జీ ( ప్రదీప్ రావత్) ..కానీ అది కుదరకపోవడంతో కలకత్తాలో ఉండే పిఆర్(దేవన్) కూతుర్ని తీసుకొని చెప్తాడు… అప్పుడు శ్రీను ఏమిచేస్తాడు..? శ్రీను ని బాబ్జీ ఎందుకు చంపాలనుకుంటాడు..? శైలజ ని ఎవరు కిడ్నాప్ చేస్తారు..? శ్రీను , శైలజ కలుసుకుంటారా..? అనేది మీరు తెరఫై చూడాల్సిందే..

ప్లస్ :

గోపీచంద్
రెజిన గ్లామర్
అక్కడక్కడ కామెడీ
సినిమాటోగ్రఫీ

మైనస్ :

కథ
స్క్రీన్ ప్లే
డైరెక్షన్
సాంగ్స్

సాంకేతిక విభాగం :

చిత్రానికి ప్రసాద్ మురేళ్ళ అందించిన సినిమాటోగ్రఫీ చాల బాగుంది..అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఒకే అనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అంతగా వర్క్ అవుట్ కాలేదు..గౌతంరాజు ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ అలాఅలా నడిచిన సెకండ్ హాఫ్ చాల బోర్ కొట్టిస్తుంది..కొన్ని సీన్స్ అయితే బాగా సాగాదిసినంట్లు అనిపిస్తుంది.

శ్రీధర్ సీపాన రాసిన కథ లో కొత్తదనం లేదు, ఇక కోన వెంకట్ – గోపి మోహన్ లు రాసిన కథనం ఫస్ట్ హాఫ్ ని కొంత పర్వాలేదు అనిపించినా . సెకండాఫ్ ని మాత్రం ఏదో వాళ్లే చూస్తారులే అనే మాదిరిగా వదిలేసారు. స్క్రీన్ ప్లే బాగా మైనస్..

ఎఎస్ రవికుమార్ చౌదరి గురించి చెప్పాలంటే ‘పిల్ల నువ్వు లేని జీవితం ‘ కాస్త పారలేదు అనిపించినా సౌఖ్యం మాత్రం పూర్తిగా రివర్స్ .. సినిమాలో చాలామంది కమెడియన్స్ పెట్టాడు కానీ వారిని వాడుకోవడం లో సక్సెస్ కాలేకపోయాడు..

చివరిగా :

జిల్ మాదిరి ట్విస్ట్ లు , లౌక్యం మాదిరి కామెడీ ఉంటుందని అనుకుంటే పప్పులో కాలువేసిన వాళ్ళవుతారు..సినిమాలో అక్కడక్కడ కాస్త కామెడీ, సాంగ్స్ లో రెజిన అందాల ప్రదర్శన , రెగ్యులర్ గా చూసే గోపీచంద్ తప్ప సినిమాలో ఏమి కొత్తదనం ఉండదు..మూడు గంటల సేపు వామ్మో అనుకోవడం తప్ప ఏమి ఉండదు.మొత్తంగా సినిమా చూస్తే ‘సౌఖ్యం ‘ గా బయటకు రాలేరు.