మనం తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న నాగార్జున 2016 లో రెండు సినిమాలతో రాబోతున్నాడు..‘ఊపిరి’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లతో దూసుకవస్తున్నాడు.. సోషియో ఫాంటసీ తో రాబోతున్న ‘సోగ్గాడే చిన్న నాయనా’ చిత్రం ఫై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.. నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిన ఈ చిత్ర థియేటరికల్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు చిత్ర యూనిట్…
కానీ ఫ్యాన్స్ అంచనాలు అందుకోవడం లో ట్రైలర్ చేరుకోలేకపోయింది…ట్రైలర్ చూసి నాగ్ ఫ్యాన్స్ డిస్పైంట్ అయ్యారని తెలుస్తుంది..నాగార్జున లో డైలాగ్స్ లో కొత్తదనం లేకపోవడం , ఏదో సాదా సీదాగా ఉన్నట్లు అనిపించిందని అంటున్నారు..ట్రైలర్ ఎలా ఉందంటే..సొగ్గాడే చిన్ని నాయనే…అనే ఓల్డ్ సాంగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది..రమ్యక్రిష్ణ నాగ్ తో…నీలా అవ్వకూడదనే జాగ్రత్తగా పెంచానంటుంది. మరో వైపు లావణ్య త్రిపాఠితో పిట్ట పిటపిటలాడిపోతుంది అంటే..దాని అర్ధం కోసం గూగుల్ లో వెతుకుతుంటాడు మరో నాగ్. అది చూసిన నాగ్ నా కొడుకుగా ఎలా పుట్టావ్ రా అంటాడు. ఇంతలో…శివుడు గుడి…సర్ ఫ్రజ్ చేస్తూ… స్నేక్…ఫైనల్ గా నా ఫ్యామిలీ జోళికి వస్తే…వాసివాడి తస్సాదీయ్యా అంటూ ఫైట్ చేస్తున్నాడు నాగ్.
నాగార్జున ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయగా , నాగ్ సరసన రమ్యక్రిష్ణ, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబిన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు..సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.