రివ్యూ : సైజ్ జీరో – బరువు ఎక్కువ

టైటిల్ : సైజ్ జీరో (2015)
స్టార్ కాస్ట్ : అనుష్క , ఆర్య , ప్రకాష్ రాజ్..
డైరెక్టర్ : ప్రకాష్ కోవెలమూడి
ప్రొడ్యూసర్ : ప్రసాద్ వి పోట్లురి
మ్యూజిక్ : ఎమ్.ఎమ్.కీరవాణి
విడుదల తేది : నవంబర్ 27, 2015
తెలుగు మిర్చి రేటింగ్ :2.75/5

రివ్యూ : సైజ్ జీరో… బరువు ఎక్కువ…

Size-Zero-Telugu-Review

అనుష్క, ఆర్య ప్రధానపాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్‌పై దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘సైజ్‌ జీరో’. బాహుబలి, రుద్రమదేవి, చిత్రాల తర్వాత అనుష్క నటించిన ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను ఎంత వరకు అందుకుందో..అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం…

కథ :

సౌంద‌ర్య‌ (అనుష్క‌) చిన్న‌ప్ప‌ట్నుంచీ తిండి ఫై బాగా మక్కువ ..దాంతో బాగా లావుగా ఉంటుంది. ఏజ్ పెరిగేకొద్దీ ఆమె సైజు కూడా పెరుగుతూ వస్తుంది. పెళ్లీడు వ‌చ్చిన ఆమెనెవ్వ‌రూ చేసుకోవడానికి ముందుకు రారు. కొంత మంది వచ్చిన సౌంద‌ర్య‌ లావు ని చూసి వెళ్ళిపోయే వాళ్ళు..దాంతో సౌందర్య త‌ల్లి(ఊర్వ‌శి) ఆమెకు ఎలాగైనా పెళ్లిచేయాల‌ని ఉద్దేశ్యం తో బాబా(బ్ర‌హ్మానందం) పెళ్లి సంబదాలను చూడమంటూ వెంటపడుతుంది..ఈ లోపు అతి తక్కువ టైం లో భారీ సైజు ఉన్న సౌంద‌ర్య‌ ని సైజు జీరో తో తగ్గించవచ్చని కొంతమంది చెప్పడంతో సైజ్ జీరో స‌త్యానందం(ప్ర‌కాశ్ రాజ్) గురించి తెలుసుకొని అతడి చుట్టూ తిరుగుతుంటుంది. ఇదే క్ర‌మంలో ఇండియాకు సోష‌ల్ స‌ర్వీస్ చేయ‌డానికి వ‌చ్చిన అభి (ఆర్య‌)ని చూసి సౌంద‌ర్య ప్రేమలో ప‌డుతుంది. కానీ అత‌ను మ‌రో అమ్మాయి(సోనాల్ చౌహాన్ ) ను ప్రేమిస్తాడు. ఈ టైమ్ లోనే సైజ్ జీరో సెంట‌ర్ కు వెళ్లిన ఓ అమ్మాయికి వాళ్లిచ్చే డ్ర‌గ్స్ తో ఆరోగ్యం పాడైపోతుంది అని సౌంద‌ర్య కు తెలుస్తుంది. అప్పుడు సౌంద‌ర్య‌ సైజ్ జీరో స‌త్యానందంపై ఎలా పోరాటం చేసింది.? చివ‌రికి సౌంద‌ర్య స‌న్న‌బ‌డిందా.. లేదా అనేది మిగతా స్టొరీ..

ప్లస్ :

సైజ్ జీరో చిత్రానికి మొదటి ప్ల‌స్ పాయింట్ అనుష్క అని చెప్పాలి. ఈ రోల్ లో నటించేందుకు అనుష్క ఏకంగా 20 కేజీల బ‌రువు పెరిగింది. అనుష్క త‌న కేరీర్‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన క్యారెక్ట‌ర్ల‌న్ని ఒక ఎత్త‌యితే సైజ్ జీరోలో ఆమె చేసిన సౌంద‌ర్య‌ క్యారెక్ట‌ర్ ఒక ఎత్తు..

సినిమాలో మరో ప్లస్ ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు. అనుష్క – ఊర్వ‌శి మద్య వచ్చే ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు కంట తడి పెట్టిస్తాయి.. బాబా రోల్ బ్ర‌హ్మానందం చేసిన కామెడీ ధియేటర్ లలో నవ్వులు పుయిస్తాయి..ఫస్ట్ హాఫ్ కామెడీ తో సాగిపోతుంది..

అలాగే కీరవాణి అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్..అలాగే సోనాల్ గ్లామర్ సినిమాకి అదనపు ఆకర్షణ.. క‌నిక కథ కు చక్కటి దర్శకత్వ ప్రతిభ కనపరిచాడు ప్రకాష్ …

మైనస్ :

ఫస్ట్ హాఫ్ అంత కామెడీ తో అలా సాగిపోవడం తో ప్రేక్షకుడికి ఎక్కడ కూడా బోర్ ఫీలింగ్ రాదు..కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కాస్త స్లో న‌రేష‌న్‌ కనపడింది…క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌కు కాస్త దూరంగా ఉండ‌డం తప్ప సినిమాలో పెద్దగా మైనస్ లు లేవు..

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్ర‌ఫీ. నీర‌వ్ షా కెమెరా ప‌నిత‌నం అద్భుతంగా ఉంది. ఇక కీర‌వాణి అందించిన సంగీతం బాగుంది.. పెళ్లికి ముందు అమ్మాయి లావుంటే రిజెక్ట్ చేస్తారా.. పెళ్లైన త‌ర్వాత లావైతే డివోర్స్ ఇస్తారా..?, అబ్బాయిల‌కు అమ్మాయిలు ఇలాగే కండీష‌న్లు పెడితే దేశంలో స‌గం మంది అబ్బాయిలు స‌న్యాశుల్లా మిగిలిపోతారు వంటి డైలాగులు ఆలోచించే విధంగా కిర‌ణ్ రాసాడు. క‌నిక ధిల్లాన్ అందించిన క‌థ యూనివ‌ర్స‌ల్ గా ఉంది.ఇక పివిపి ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. లేడీ ఓరియెంటెడ్ చిత్రం అయినా.. ఖ‌ర్చుకు ఎక్కడ వెన‌కాడ‌లేదు. ఇక దర్శకుడు ప్ర‌కాష్ విష‌యానికి వ‌స్తే వాస్త‌విక అంశాల‌తో సైజ్ జీరో చిత్రాన్ని తెర‌కెక్కించిన విధానం చాలా బాగుంది. ప్ర‌స్తుతం సైజ్ జీరో అన్న భ్ర‌మ‌లో ఉండి …వాళ్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు…మ‌న‌ష్యులు బ‌రువు త‌గ్గేందుకు స‌హ‌జ‌మైన ప‌ద్ధ‌తులే మంచివ‌న్న సోష‌ల్ మేసేజ్‌ను చిత్రం లో బాగా చూపించారు.

చివరిగా :

అమ్మాయి అందాన్ని కేవలం ఆమె సైజ్ లోనే కాదు ఆమె మనసుతో కూడా చూడాలని చెప్పి దర్శకుడు సక్సెస్ అయ్యాడు..సైజ్ జీరో అంటే ఏంటో తెలుసుకుంటూ ఫ్యామిలీ అంత ఎంజాయ్ చేసే చిత్రం.