‘బ్రూస్ లీ’ ఏ సర్టిఫికేట్ ఇచ్చారో తెలుసా..?

Brucelee-censorరామ్ చరణ్ – శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ & యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈరోజు సెన్సార్ ముందుకు వెళ్ళింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సబ్యులు ‘బ్రూస్ లీ’ కి క్లీన్ ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు.

చాల ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తుండడం తో సినిమా ఫై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నదియా, కృతి కర్భంద, అరుణ్ విజయ్, రావు రమేష్ లు ముఖ్య పాత్రలు పోషించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.