పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి మరో షాక్ న్యూస్ …

sardar-postponed
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – బాబి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్ – గబ్బర్ సింగ్’, తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ఫై షాక్ న్యూస్ పేల్చాడు నిర్మాత శరత్ మరార్..ఫాన్స్ అంత సంక్రాంతికి రిలీజ్‌ అవుతుందంటూ తెగ సంబరాలు పడుతుంటే, తాజాగా ఈ చిత్రాన్ని సమ్మర్ కు పోస్ట్ పోనే చేసినంట్లు వార్తలు వినిపిస్తున్నాయి…దీనికి కారణం పవన్ కళ్యాణ్ అట..

గతంలో పూరి దర్శకత్వం లో హడావిడిగా తీసిన చిత్రం ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ ఏమైందో తనకు బాగా తెలుసని మళ్ళీ అటువంటి రిజల్ట్ తన అభిమానులకు ఇవ్వడం తనకు ఇష్టం లేదని అందువల్ల ఈసినిమాను సంక్రాంతికి విడుదల చేయడం కోసం వేగంగా పని చేయడం కన్నా గతంలో ‘గబ్బర్‌సింగ్‌’ రిలీజ్‌ చేసినట్టుగానే దీనిని కూడా సమ్మర్‌లో రిలీజ్‌ చేద్దామని పవన్‌ చెప్పినంట్లు సమాచారం..ఇది కరెక్ట్ నిర్ణయమే కానీ ఇప్పటికి పవన్ కళ్యాణ్ ని తెర ఫై చూసి రెండేళ్ళు కావడం తో అబిమానులు ఎప్పుడెప్పుడు కళ్యాణ్ ని చూద్దామని అనుకుంటున్నా టైం పవన్ ఈ నిర్ణయం తీసుకోవడం తట్టుకోలేక పోతున్నారు.