హ్యాపీ డేస్ , కొత్తబంగారులోకం చిత్రాలతో యూత్ కు బాగా దగ్గరయిన హీరో వరుణ్ సందేశ్…కెరియర్ లో ఏమా జోరుగా సినిమాలు చేస్తూ వచ్చిన సరయిన హిట్ మాత్రం కొట్టలేకపోయాడు..రెండేళ్ళు అయిన కానీ మన హీరో కి ఒక్క హిట్ కూడా తలుపు తట్టలేదు..దీంతో చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది.
దీంతో చేసేది ఏమిలేక పెళ్లి బాట పడ్డాడు ఈ యంగ్ హీరో..కొన్నిరోజులనుండి ఎవర్ని చేసుకునేది చెప్పకుండా తిరుగుతున్న వరుణ్..తాజాగా ఆమె ఎవరో బయటపడింది.. ఈ మధ్యే పడ్డానండి ప్రేమలో మరి అనే చిత్రం తో హీరోయిన్ గా పరిచయం అయిన వితిక .. ఆ సినిమా సమయం లో ప్రేమలో పడ్డాడట ! ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో త్వరలోనే వీరి వివాహం జరగనుంది అని తెలుస్తుంది..