టూరిజం మిషన్, పాలసీ ఆవిష్కరణ హైలైట్స్

cbn-ap-rajadani
• ఇవాళ రూ. 830 కోట్లు రిజిస్టేషన్స్, రూ.3845 కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకోవడం చారిత్రాత్మకం.
• ఇది టూరిస్టు ప్రమోషనో, ఇండస్ట్రీస్ ప్రమోషనో అర్థం కానంత అద్భుతంగా ఇవాళ ఎంవోయూలు జరిగాయి.
• టూరిజం ప్రమోట్ చేయాలన్నది ఇప్పటి సంకల్పం కాదు, గతంలో నేను సీయంగా వున్నప్పుడే ఐటీ తర్వాత దీన్ని ప్రాధాన్యరంగంగా తీసుకున్నాను.
• ప్రతి రూ. 1000 పెట్టుబడికి మాన్యుఫాక్చరింగ్ రంగంలో అయితే 27 ఉద్యోగావకాశాలు దొరుకుతాయి. అదే వ్యవసాయరంగంలో 42, సర్విస్ సెక్టారులో 72 అవకాశాలు లభ్యం అవుతాయి.
• ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీల మినహాయింపు, సర్వీస్ టాక్స్ మినహాయింపు వంటి ఆకర్షణలెన్నో టూరిజం కొత్త పాలసీలో వున్నాయి.
• టూరిజం అంటే మన దగ్గర రిలిజియస్ టూరిజంగానే వుండిపోయింది. వచ్చే యాత్రికులంతా వెంకటేశ్వరుడి భక్తులే. నిత్యం కొండపైకి 75 వేల మంది భక్తులు వస్తున్నారు.
• చెన్నయ్ బాలాజీ టెంపుల్ పెడితే అక్కడ కూడా రూ.25 కోట్లు ఆదాయం వస్తోంది. ప్రపంచంలో అత్యంత సంపన్నవంతుడు వేంకటేశ్వరుడే.
• ఏపీలో విశిష్టమైన దేవాలయాలు అనేకం వున్నాయి. 160 దేవాలయాలు అధికాదాయాన్ని సమకూర్చేవిగా వున్నాయి.
• దేవాలయాలు కూడా గ్రోత్ ఇంజన్స్ ‌గా గుర్తించాలి.
• మానసిక ప్రశాంతత వచ్చేది పుణ్యక్షేత్రాల్లోనే.
• మనిషి రీఛార్జ్ అవడానికి టూరిజం ముఖ్యమైన మార్గంగా వుంది.
• సామాన్యుడు కూడా పట్టణానికి వెళ్లి సినిమా చూసి ఆహ్లాదం పొందుతాడు.
• ఆంధ్రప్రదేశ్‌లో అద్ఛుతమైన పర్యాటక ప్రదేశాలు అనేకం వున్నాయి.
• టూరిజం అంటే కేరళ, గోవా గుర్తొస్తాయి.
• కేరళలో వున్న బ్యాక్ వాటర్, గ్రీనరీ మనకీ వున్నాయి. అయినా గత పదేళ్లలో ఈరంగం తీవ్రంగా నిర్లక్ష్యానికి గురయ్యింది.
• గోవాలో వున్న బీచ్ అందాలు మనకు లేవా?
• గోదావరిలో ఎక్కువ విస్తీర్ణంలో సుందరమైన లంకభూములు వున్నాయి.
• కృష్ణానది లాంటి సుందరమైన ప్రదేశం ఎక్కడా కనిపించదు. ఇన్ని కిలోమీటర్ల పొడవున వాటర్ ఫ్రంట్ వున్న ప్రాంతం మరెక్కడా లేదు.
• లండన్, ప్యారిస్, గౌహతి మాత్రమే నదీనగరాలుగా వున్నాయి.
• విజయవాడ నగరం కాలువల నగరం. బ్యూటిఫికేషన్ చేస్తే ఇక్కడ సాయంత్రాల్ని ఎంతో ఆహ్లాదంగా మార్చుకోవచ్చు.
• సుదీర్ఘమైన కోస్తాతీరం మనకే సొంతం.
• నాగార్జున కొండ, ఎత్తిపోతల, కొల్లేరు, పులికాట్ వంటి ప్రకృతి వనరులు మన రాష్ట్రంలో వున్నాయి. సొమశిల, కండలేరు రిజర్వాయర్లు జలకళతో అలరారుతాయి.
• టూరిజంలో ఎటు చూసినా అవకాశాలు పుష్కలంగా వున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌తో అభివృద్ధి చేయాలి. అన్నీ ప్రభుత్వమే చేయలేదు. ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా వుంటుంది.
• కన్వెన్షన్ సెంటర్లు, ఎగ్జిబిషన్ సెంటర్లు, ఎమ్యూజ్‌మెంటు పార్కులు, 7, 5 స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు ఎన్నో వస్తున్నాయి.
• హోటల్ రంగం అభివృద్ధి చెందడానికి రాష్ట్రంలో అన్ని అవకాశాలు వున్నాయి.
• ఏపీ ప్రజలు ప్రశాంతమైన జీవనాన్ని ఇష్టపడతారు. పెట్టుబడిదారులకు ఇది అడ్వాంటేజ్.
• సర్విస్ సెక్టారులో స్కిల్ డెవలప్‌మెంటు అవసరం వుంది.
• కూచిపూడి అభివృద్ధికి రూ.. 100 కోట్లు బడ్జెట్ ఇచ్చాం.
• ఇక్కడ దొరికే వెరైటీ ఫుడ్ మరెక్కడా దొరకదు.
• టర్కీ షాపింగ్, ఈటింగ్, ట్రావెలింగ్, ఇలా అన్ని అవకాశాలు వున్న ఎకనమిక్ యాక్టివిటీ జోరుగా జరిగే నగరంగా వుంది.
• ఇవాళ జరిగిన ఎంవోయూలు, ప్రొవిజనల్ సర్టిఫికేట్లతోనే వదిలిపెట్టను. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు వెంటపడతాను.
• ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ పెట్టుబడిదారులకు వున్న మరో ముఖ్యమైన అడ్వాంటేజి
• 2050 నాటికి బెస్ట్ డెస్టినేషన్ స్టేట్‌గా తయారు కావాలన్నదే విజన్ డాక్యుమెంట్
• దేశంలోనే తొలిసారి 40 గ్రోత్ ఇంజన్స్ గుర్తించి దానికి అనుగుణంగా పనిచేస్తున్న రాష్ట్రం మనదే.
• పైనుంచి కింది స్థాయి వరకు మా అధికారులందరికీ లక్ష ట్యాబ్స్ ఇచ్చాం. అకౌంటబులిటీ కోసం అడుగడుగునా ప్రయత్నిస్తున్నాం.
• ఏపీలో ఈ క్వార్టర్లీ గ్రోత్ తీసుకుంటే 9.72 శాతంగా వుంది.
• సర్వీస్ సెక్టారులోనే మ్యాగ్జిమమ్ ఎకానమీ, మ్యాగ్జిమమ్ ఎంప్లాయిమెంటు, మ్యాగిమమ్ వెల్త్ వస్తాయి.
• ప్రపంచంలోని అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలను హైదరాబాద్ తీసుకొచ్చిన అనుభవం మనకుంది.
• సౌత్ ఈస్ట్ ఆసియాకు ఇది ముఖద్వారం. డీప్ వాటర్ పోర్టులు మనకు అదనపు ఆకర్షణ.
• ఏపీలో నీటికి కొరత లేదు. నదులను కలిపిన ఘనత రాష్ట్రానిదే. ఆక్వాలో మనం స్ట్రాంగ్. సీ కోస్ట్, సుందరమైన పర్వత ప్రాంతాలు మనసొంతం.
• కృష్ణానదీ అందాల్ని ఉదయం 6, 7 గంటల సమయంలో వెళ్లి చూడండి.
• రండి, మాతో భాగస్వాములవ్వండి. మేము ఫెసిలిటేట్ చేస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో టూరిజంలో ఏపీని అగ్రగామిగా మార్చుదాం.
• ఇవాళ రూ. 830 కోట్ల విలువైన రిజిస్ట్రేషన్స్, రూ. 3845 కోట్ల విలువైన ఎంవోయూలు చారిత్రాత్మకం
• గ్రీన్ అండ్ ల్యాండ్ స్కేపింగ్ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తున్నాం. బెస్టు ఆర్కిటెక్ట్స్ ఎక్కడున్నా తీసుకొచ్చి మన నగరాల్ని, ఊళ్లని స్మార్ట్ ఊళ్లుగా మార్చుకుందాం.
• స్వచ్ఛాంధ్రపదేశ్ కార్పొరేషన్ ఇప్పటికే ఏర్పాటుచేసుకున్నాం.
స్థానికులకు ఇది మంచి అవకాశం. గ్లోబల్ పార్ట్‌నర్స్‌గా మారి మీకు మీరు అభివృద్ధి చెందండి.
నీరబ్ కుమార్ ప్రసాద్ (టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ):
• పర్యటక, ఆతిధ్యరంగంలో రానున్నా ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల పెట్టుబడుల అంచనాలు.
• రూ. 10 వేల కోట్ల విలువైన పెట్టుబడి అంచనాల్లో ఇప్పటికే రూ.5748 కోట్ల విలువైన ప్రాజెక్టులు గుర్తించాం.అవసరమైన వనరులు, ప్రోత్సాహకాలు అన్నీ అందిస్తాం.
• 680 ప్రాజెక్టులు, 9 ధీమ్స్
• రానున్న 3 నెలల్లో పూర్తియ్యే రూ. 830 కోట్ల విలువైన ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్స్ ఇవాళ జరిగాయి.
• రూ.855 కోట్లు పీపీపీ ప్రాజెక్టులు
• పర్యాటకరంగంలో జెయింట్స్‌గా వున్న ప్రముఖ సంస్థలు ఎన్నో ఎంవోయూలు చేసుకుంటున్నాయి.
• ప్రభుత్వానిది ఫెసిలిటేటర్ పాత్ర.
మండలి బుద్ధప్రసాద్:
• నవ్యాంధ్రప్రదేశ్ సహజవనరులకు ఆలవాలం.
• ప్రాచీన వారసత్వ సంపద, సంస్కృతి సంప్రదాయాలు, దేవాలయాలు, సముద్రతీరం మనకు మాత్రమే సొంతం.
• టూరిజానికి ఆ రోజుల్లోనే పెద్దపీట వేసి ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించిన ఘనత చంద్రబాబుదే.
• చారిత్రక కట్టడాలకు వైభవాన్ని కల్పించిన ఘనత ఆయనదే. సింగపూర్ వంటి దేశాలు పర్యాటకరంగంపైనే అభివృద్ధి చెందాయి.

ఇవాళ ప్రొవిజనల్ సర్టిఫికెట్లు తీసుకున్న వారి వివరాలు:
• బుద్ద బీచ్ రిసార్టు చీరాలలో రూ. 40 కోట్ల పెట్టుబడితో బీచ్ రిసార్టు ప్రాజెక్టు
• గోల్డెన్ శాండ్ – బీచ్ రిసార్ట్- బాపట్లలో రూ. 40 కోట్లు
• సీ వ్యాలీ –రూ. 15 కోట్లు – విజయవాడలో ఫైవ్ స్టార్ హోటల్
• పీస్ హోటల్స్ –రాజమండ్రిలో రూ. 150 కోట్లు
• సాయి విఘ్నేష్ హోటల్- విజయవాడలో రూ. 100 కోట్లు
• కేఈఐ రాజమహేంద్రిలో రూ. 20 కోట్లతో 3స్టార్ హోటల్
• మినీ హోటల్స్ రూ. 17.5 కోట్లతో ఏపీలో 3 స్టార్ హోటల్
• ఎంఎస్ ఆర్ కే రిక్రియేషన్ రూ. 13 కోట్లు- తూర్పుగోదావరి జిల్లా
• త్రివిక్ హోటల్ రూ. 40 కోట్లు- రాజమండ్రి రీజియన్
• సాయి హాస్పిటాలిటీ రూ. 1.85 కోట్లు-నెల్లూరు
• యూనియన్ ఈస్ట్- సామర్లకోటలో వే సైడ్ ఎమనిటీస్
• ఛాంపియన్ యాట్ క్లబ్ – అమరావతి, భవాని ఐలాండ్‌లో రూ. 113 కోట్లు
• స్కై చాపర్స్- సీ ప్లేన్ సర్విసెస్-రూ. 300 కోట్లు
• చంద్ర మెరైన్ – రివర్ క్రూయిజ్ – పట్టిసీమలో..రూ. 0,85 కోట్లు
• పున్నమి – పట్టిసీమ, భీమునిపట్నంలలో..
• అరకులో క్రీసెంట్ అడ్వెంచర్స్ రూ. 1.2 కోట్లు
• లైవిన్ అడ్వెంచర్స్ రూ. 10 కోట్లు అరకు, ఇతర ప్రాంతాల్లో..
• శ్రీసిటీ సందీప్ – పులికాట్ లేక్
• క్రాఫ్ట్ మెన్ రియాలిటీ- యాంఫీబియస్ బోట్ సర్విసెస్ రూ. 8 కోట్లు
• ఫ్రీకౌట్స్ అడ్వంచర్ సొల్యూషన్స్ – అరకు, భవానీద్వీపం, కర్నూలులో 13 వెరైటీల అడ్వెంచర్ ప్రాజెక్టులు
• ఇక్వాస్ ప్రాజెక్ట్
ఇవాళ ఎంవోయూలు చేసుకున్న వారి వివరాలు:
• సీఐఐ సురేశ్ చిట్టూరితో ఎంవోయూ
• ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ భాస్కరరావు
• ఒబెరాయ్ గ్రూపుతో 5 స్టార్ హోటల్స్ ఏపీలో..
• ఎకార్ హెటల్స్ అండ్ సీ వ్యాలీ రిసార్ట్స్ రూ. 385 కోట్లు హోటళ్లు కన్వెన్షన్ సెంటర్లు విశాఖ తిరుపతి విజయవాడ తిరుపతి
• ఐటీసీ లిమిటెడ్ 2 ఫైవ్ స్టార్ హోటళ్లు రూ. 290 కోట్లు –విశాఖ, గుంటూరులో
• తాజ్ గేట్ వే హోటల్ రూ. 200 కోట్లు – అమరావతిలో..
• హోటల్ లీలా వెంచర్ లిమిటెడ్ 5 స్టార్ హోటల్
• కార్ల్‌సన్ రిజెడార్ గ్రూపు 5 స్టార్ ఏపీలో
• ఎస్ ఎల్ గ్రూపు ఇంటిగ్రేటెడ్ రిసార్ట్స్ రూ.1000 కోట్లు
• మహేంద్ర హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ఏపీలో రిసార్ట్స్
• స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్స్ అరకు, మైపాడు, భవానీ ఐలాండ్ సూర్యలంక రూ. 120 కోట్లు
• జీఆర్ టీ గ్రాండ్ హోటల్ కాకినాడలో రూ. 45 కోట్లు
• విజయవాడ అండ్ శ్రీసిటీలో ఎం అండ్ ఎం
• ప్రగతి గ్రీన్ మెడోస్ రూ. 300 కోట్లు విశాఖలో బయో డైవర్సిటీ థీమ్ పార్క్
• కావేరీ రిట్రిట్స్ అండ్ రిసార్ట్ రూ. 150 కోట్లు
• థామస్ రిసార్ట్స్ బ్యాక్ వాటర్ రిసార్ట్స్ ఈస్ట్ గోదావరి, విశాఖల్లో రూ. 85 కోట్లు
• వండర్లా హాలీడే అమ్యూజ్ మెంటు పార్కు ఏపీలో
• రూ.150 కోట్లతో నార్త్ ఈస్ట్ ఇన్ ఫ్రా జల విహార్
• స్విస్ సోలార్ టెక్నాలజీ కన్సోర్టియం ఆక్వా పార్క్ రిషికొండ
• ఎస్ పీ ఐ సినిమాస్ రూ. 510 కోట్లతో 14 చోట్ల కన్వెన్షన్ సెంటర్లు
• ఇండియా ఎక్స్ ట్రీమ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ రూ. 50 కోట్లతో విశాఖలో అడ్వెంచర్ స్పోర్స్ట్
• ట్రూజెట్ మేఘా ఎయిర్ వేస్ – ఎయిర్ లైన్స్ సర్విసెస్, డెస్టినేషన్ అండ్ ప్యాకేజెస్‌లో జాయింట్ వెంచర్.
• స్పైస్ జెట్ – ఎయిర్ లైన్స్ సర్విసెస్, డెస్టినేషన్ అండ్ ప్యాకేజెస్‌లో జాయింట్ వెంచర్.
• పవన్ హన్స్ హెలీ టూర్స్ సర్విసెస్
• మేరు క్యాబ్స్ -రేడియో క్యాబ్ సర్విసెస్, డెస్టినేషన్ అండ్ ప్యాకేజెస్‌లో జాయింట్ వెంచర్
• ఓలా క్యాబ్స్
• అని టెక్నాలజీస్
• ఇబిబో ఆన్ లైన్ బుకింగ్ సర్విసెస
• మేక్ మై ట్రిప్ ఆన్ లైన్ బుకింగ్ సర్విసెస్
• థామస్ కుక్ ఇండియా ఆన్ లైన్ బుకింగ్ సర్విసెస్
• సీఐఐ
• జెట్ ఎయిర్ వేస్