మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పర్చుకుని, అన్న చిరంజీవి పేరు వాడుకోకుండా సొంత టాలెంట్ తో ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోగా ఎదిగిన ఒకే ఒక నటుడు పవన్. ఇతడు నటించిన చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు. పవన్ కళ్యాణ్ ని దేవుడిగా కొలుస్తారు ఫాన్స్. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తూ వస్తున్నాయి..ఎన్ని రికార్డ్స్ వచ్చిన పవన్ మాత్రం వాటికీ దూరంగా ఉంటాడు..
తెలుగు సినిమా చరిత్ర ఆల్‌టైమ్ రికార్డులను ఎన్నో తన ఖాతాలో వేసుకున్నా పవన్‌కు అవన్ని పట్టవు. కేవలం సినిమాకు కష్టపడి పనిచేశామా, ప్రేక్షకులను ఆకట్టుకున్నామా అనే విధంగానే పవన్ ఉంటాడు. రికార్డులను, కలెక్షన్స్‌ను పెద్దగా పట్టించుకోని పవన్ వ్యక్తిగతంగా కూడా తనకు తాను ప్రత్యేక శైలిని ఏర్పర్చుకున్నారు. ఎంత ఉన్నా కూడా నిరాడంబర జీవితాన్ని గడిపే పవన్ కళ్యాణ్, ప్రస్తుతం రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ, మరో పక్క అబిమానుల కోసం సినిమాలు చేస్తూ అందరివాడు గా ఎదుగుతున్నాడు.
పుట్టినరోజంటే పవన్ అభిమానులకు పండగరోజే. హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ సింపుల్‌గా పుట్టినరోజుని తన ఫ్యామిలీతో జరుపుకోవడం ఆయనకు మొదటినుంచీ అలవాటు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నప్పటికీ ఆయన అభిమానులు మాత్రం ఊరూరా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అబిమానుల కోసం ‘సర్దార్ ‘ ఫస్ట్ లుక్ టిసర్ ని రిలీజ్ చేసారు…మీకోసం ఈ వీడియో.. చూసి ఎంజాయ్ చెయ్యండి…