ఏపి రాజధానికి తరలి వెళ్లే ఉద్యోగుల పిల్లల స్ధానికత నిర్దారణ పై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే..వీరి స్థానికత అంశం పై అధ్య యనం చేసేందుకు ప్రభుత్వం ముగ్గురు కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ కార్యదర్శుల కమిట తో సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల పిల్లలు ఎంతమంది ఉన్నారు..వారి స్థానికత కు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాల పై చర్చించారు. అయితే,,న్యాయ పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగా..ఏపి సచి వాలయ ఉద్యోగ సంఘాలతో పాటుగా..ఏపి ఎన్జీవో సంఘాలతో ఏపి న్యాయ శాఖ కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు అయరావతి కి వెళ్లాలంటే..ఉద్యోగుల స్ధానికత ఆధారంగా తమ పిల్లల స్ధానికత ఖరారు చేయాలని ఉద్యోగ సంఘ నేతలు కోరారు. దీని వలన..ఒకే జిల్లా పై భారం పడకుండా..ఎవరి సొంత జిల్లాల్లో వారికి స్ధానికత వస్తుందని..భవిష్యత్‌లో కూడా ఇబ్బందులు ఉండవని ఉద్యోగ సంఘాలు వివరించాయి.
ఇదే సమయంలో జోనల్ వ్యవస్ధ రద్దు చేయాలనే ప్రతిపాదన పై ఉద్యోగ సంఘాలు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆలోచన పూర్తి స్ధాయిలో తెలుసుకోకుండా స్పందించలేమని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే..జోనల్ వ్యవస్ధ రద్దు చేస్తే కొన్ని ప్రాంతాల్లోని ఉద్యోగు లు ఇబ్బంది పడతారనే అభిప్రాయం కొంత మంది వ్యక్తం చేస్తుంటే..ప్రభుత్వ ఉద్దేశం తెలుసుకోవాల్సి ఉందంటున్నారు మరి కొందరు. అయితే.. ఉద్యోగులను ఏపి రాజధానికి తరలించే ప్రయత్నంలో ఉద్యోగుల స్థానికత ఆధారంగా వారి పిల్లలకు స్ధానికత ఇచ్చినట్లైతే..ఆ ప్రాంతాల్లోనే వారి విద్యా-ఉద్యోగ అవకాశాలు వస్తాయని..రాష్ట్ర స్ధాయి పోస్టుల కోసం రాజధాని ప్రాంతం ఫ్రీ జోన్‌గా ఉంటుందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఏ జిల్లా పైనా భారం పడకుండా ఉద్యోగుల పిల్లల స్ధానికత ఖరారు చేయాలని వారు కోరుతున్నారు.
స్ధానికత అంశానికి పరిష్కారం నిర్ణయించి..దీనిని కేంద్రం ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అదే సమయంలో..నిర్ణయం తీసుకొని ముసాయిదా సిద్దం చేసి..మరో సారి ఉద్యోగ సంఘాలతో సమావేశం తరువాత తుది రూపు ఇవ్వనుంది..