మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్ గా, సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న ‘బెంగాల్ టైగర్’ చిత్రానికి సంబందించి థీమ్ సాంగ్ ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ లో 120 మంది డాన్సర్స్ తో మాస్‌మహరాజ్ రవితేజ పై చిత్రంలో ఇంట్రడక్షన్ సాంగ్ గా చిత్రీకరిస్తున్నారు . ఈ సాంగ్ కోసం హీరోయిన్ హంసనందిని మాస్‌మహరాజ్ తో స్టెప్స్ వేస్తుంది. ప్రేక్షకాదరణ వున్న చిత్రాల్ని నిర్మించిన కె కె రాధామోహన్ నిర్మాత. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బలుపు’,’ పవర్’ చిత్రాల తరువాత రవితేజ, రచ్చ చిత్రం తరువాత సంపత్ నంది కాంబినేషన్ లో వస్తుండటంతో ‘బెంగాల్ టైగర్’ చిత్రపై మాస్‌మహరాజ్ అభిమానుల్లో మరియు సిని ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.
నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ” మా బ్యానర్ లో మాస్‌మహరాజ్ రవితేజ , తమన్నా, రాశిఖన్నా లు జంటగా తెరకెక్కిస్తున్న ‘బెంగాల్ టైగర్’ చిత్రం షూటింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా శరవేగంగా జరుగుతోంది.ప్రస్తుతం థీమ్ సాంగ్ ని 120 మంది డాన్సర్స్ తో మాస్‌మహరాజ్ రవితేజ పై చిత్రంలో ఇంట్రడక్షన్ సాంగ్ గా చిత్రీకరిస్తున్నారు . ఈ గీతాన్ని ప్రముఖ కన్నడ కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడు హర్ష ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇటివలే హర్ష కన్నడంలో శివరాజ్ కుమార్ తో రూపొందించిన వజ్రకాయ చిత్రం లో రవితేజ ఒక ప్రత్యేక గీతం లో సైతం మెరిశారు ఈ సాంగ్ లో హీరోయిన్ హంసనందిని మాస్‌మహరాజ్ తో స్టెప్స్ వేస్తున్నారు. ఈ సాంగ్ చిత్రానికి హైలెట్ అయ్యే విధంగా దర్శకుడు సంపత్ నంది ప్లాన్ చేశారు. సినిమాలో ఓ మంచి టెకాఫ్ గా ఈ సాంగ్ నిలబడుతుంది. ఇప్పటికే మా టైటిల్ అన్ని వర్గార ప్రేక్షకుల కి రీచ్ కావటం మా చిత్రం మెదటి సక్సస్ గా అనుకుంటున్నాం. అలాగే బిజినెస్ సర్కిల్ లో కూడా ప్రత్యేకమైన క్రేజ్ వుండటం చాలా హ్యపి గా వుంది. మాస్ అంటే రవితేజ, మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు సంపత్ నంది వీరిద్దరి కాంబినేషన్ లో మాసివ్ టైటిల్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకువస్తాము. అతిథి పాత్రల్లో హర్షవర్దన్ రానే, అక్ష నటిస్తున్నారు. బోమన్ ఇరానితో పాటు రావు రమేష్, షియాజి షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మా బెంగాల్ టైగర్ ఆకట్టుకుంటుంది”అని అన్నారు
దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ” ‘బెంగాల్ టైగర్’ చిత్ర షూటింగ్ అనుకున్న విధంగా ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జీ లెవల్స్ కి కరెక్ట్ సినిమా మా ‘బెంగాల్‌టైగర్’.ఈ చిత్రంలో వచ్చే ప్రతి యాక్షన్ పార్ట్ దియెటర్స్ లో విజిల్స్ పడేలా చిత్రీకరించాం. అలాగే సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ అవుతోంది. బెంగాల్ టైగర్ థీమ్ సాంగ్ ని 120 మంది డాన్సర్స్ తో షూట్ చేస్తున్నాం.. ఇది మాస్‌మహరాజ్ రవితేజ పై చిత్రంలో ఇంట్రడక్షన్ సాంగ్ గా వస్తుంది. ఈ సాంగ్ లో హీరోయిన్ హంసనందిని చేస్తుంది. ఇది రవితేజ గారి ఫ్యాన్స్ తో పాటు… అన్ని వర్గాల ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకొని చిత్రీకరిస్తున్నాం. అతి ముఖ్యంగా రవితేజగారు, బ్రహ్మనందం గారి కాంబినేషన్ లో సీన్స్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము.” అని అన్నారు.
ఈ చిత్రలో మాస్‌మహరాజ్ రవితేజ, తమన్నా, రాశిఖన్నా, బోమన్ ఇరాని, బ్రహ్మనందం, రావు రమేష్, షియాజి షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, హర్హవర్ధన్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదితరులు నటించగా..
బ్యానర్ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్, కెమెరా: సౌందర్ రాజన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: డి,వై.సత్యనారాయణ, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సంగీతం భీమ్స్ , నిర్మాత: కె.కె.రాధామెహన్, కథ-మాటలు-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్ నంది.
నిర్మాత: కె.కె.రాధామెహన్, కథ-మాటలు-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్ నంది.