ఏపి నూతన రాజధాని నిర్మాణం పై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. రాజధాని నిర్మాణంలో మున్సిపల్ అధికారుల పాత్ర కీలకంగా ఉంది. అయితే..కొద్ది రోజుల క్రితం ఆ శాఖలోని ఉన్నతాధికారుల తీరు ప్రభుత్వ పెద్దల అసంతృప్తికి కారణమైంది. రాజధాని మాస్టర్ ప్లాన్ మొద లే..నిర్మాణం వరకు సింగపూర్ ప్రభుత్వం..ప్రతినిధులు..కమిటీలతో టచ్లో ఉండాల్సిన మున్సిపల్ ఉన్నతాధికారులు కొంత ఉదాసీనంగా వ్యవ హరించారలనే వా దనలు ఉన్నాయి. సెలవులో వెళ్లిన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి గిరిధిర్ ను ప్రభుత్వం ఏపిపిఎస్సీకి బదిలీ చేసింది. అదే సమయంలో.. ఏపి నూతన రాజధాని వ్యవహారాలు..సంప్రదింపుల్లో ఇబ్బంది రాకుండా..సిఆర్డిఏ కార్యదర్శిగా పెట్టుబడులు-మౌళిక వసతుల కార్యదర్శిగా ఉన్న అజ య్ జైన్ ను నియమించారు. ఇప్పటికే..సిఆర్డిఏ కమిషనర్ గా శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు. రాజధాని వ్యవహారాలు ము న్సిపల్ పరిధిలోనే కొనసా గుతాయి. అయితే, ప్రభుత్వ కార్యదర్శిగా అజయ్ జైన్ నియామకంతో ఇక..సీఆర్డిఏ వ్యవహారాల్లో ప్రభుత్వ కార్యదర్శి గా వ్యవహరించనున్నారు.
ఇదే సమయంలో..సీడ్ ప్లాన్ అందుకున్న ఏపి ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన భూముల పై దృష్టి పెట్టింది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు వా రికి ఇవ్వాల్సిన రెసిడెన్షియల్-కమర్షియల్ ఎక్కడ ఇవ్వాలనే దాని పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 20 లోగా భూ సమీకరణ పూర్తి చేసి సేకరణ దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా..సీడ్ క్యాపిటల్లో నిర్మాణాల నమూనాల పైనా ప్రభుత్వం పలు కన్సెల్టెన్సీల అభిప్రాయం సేకరిస్తోంది. ఇక..వచ్చే క్యాబినెట్ సమావేశంలో అమరావతి డెవలపర్ పై నిర్ణయం తీసుకొని..పక్క ప్రణాళికా బద్దంగా అక్టోబర్ 22 నుంచి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.