ఏపీలో భూముల మార్కెట్ ధ‌ర‌ల పెంపు

land-rates-hike
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భూముల మార్కెట్ రేట్లు పెంచింది ప్ర‌భుత్వం….రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అన్ని జిల్లాల్లోనూ భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి . రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుని మార్కెట్ లో ధ‌ర‌ల విలువ‌లు భారీగా పెరిగిపోయాయి…అటు రాజ‌ధాని నిర్మాణం,జాతీయ విద్యాసంస్థ‌ల ఏర్పాటు,కొత్త ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తుండ‌టంతో ఒక్కోచోట గ‌తంకంటే ప‌దింత‌లు కూడా రేట్లు పెరిగిపోయిన ప‌రిస్థితి…అయితే భారీగా పెరిగిన మార్కెట్ ధ‌ర‌ల‌కు అనుగుణంగా రిజిస్ట్రేష‌న్ ధ‌ర‌లు మాత్రం పెర‌గ‌లేదు..దీంతో రిజిస్ట్రేష‌న్ల శాఖ‌కు భారీగా ఆదాయంలో కోత ప‌డుతుంది…దీంతో రేట్ల‌ను స‌వ రించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుత ఆర్దిక సంవ‌త్స‌రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్ ద్వారా 3500 కోట్లు ఆదాయం ల‌క్ష్యంగా నిర్ణ‌యిం చారు. కాగా..తొలి త్రైమాసికంలో 808 కోట్ల ఆదాయం వ‌చ్చింది.

వాస్త‌వంగా మార్కెట్ రేటును స్ట‌డీ చేసాక‌…దాని ప్ర‌కారం క‌నీసం 50 శాతంపెంపును రిజిస్ట్రేష‌న్ల శాఖ పుస్త‌కాల్లో ధ‌ర‌లుగా నిర్న‌యించింది ప్ర‌భు త్వం. గ‌త ఏడాది అనుకున్న టార్గెట్ ను 83 శాతం చేరుకున్న రిజిస్ట్రేష‌న్ల శాఖ‌…భూముల ధ‌ర‌ల స‌వ‌ర‌ణ‌తో మ‌రో రెండు వంద‌ల నుంచి 500 కో ట్లు ఎక్కువ ఆదాయం వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. వాస్త‌వంగా ప్ర‌తి రెండేళ్ల‌కోసారి ప‌ట్ట‌ణాల్లో…..ఏడాదికోసారి గ్రామీణ ప్రాంతాల్లో ధ‌ర ల‌ను స‌వ‌రించాల్సి ఉంటుంది…చివ‌రిసారిగా 2013లో రేట్లు మార్పు చేసింది అప్ప‌టి ప్ర‌భుత్వం…గ‌తేడాది రేట్లు పెంచాల్సి ఉన్న‌ప్ప‌టికీ విభ‌జ‌న కార‌ణంగా పెంచ‌లేదు…ఈసారి రేట్ల పెంపుకోసం జిల్లా జాయింట్ కలెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో క‌మిటీ వేసింది ప్ర‌భుత్వం…ఈ క‌మిటీలు నివేదిక‌ల‌ను స్టాం ప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్ ఐజీకి అంద‌జేసాయి…వాటి ఆధారంగా రేట్లు పెంచేలా అధికారులు స‌ర్కుల‌ర్ జారీచేసారు…పెరిగిన రేట్లు జిల్లాల ఆధారంగా కాకుండా గ్రోత్ రేట్ ఆధారంగా ఉండ‌నున్నాయి. పెరుగుతున్న మొత్తం ఏడు నుంచి యాభై శాతం వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంది.

ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్న ఏపీ ప్ర‌భుత్వానికి రిజిస్ట్రేష‌న్ల శాఖ ద్వారా వ‌చ్చే ఆదాయం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌నుంది…అయితే ప్ర‌భుత్వం ఆశిస్తున్నంత‌గా ఆదాయం వ‌స్తుందా లేదా అనేది త్వ‌ర‌లో తేల‌నుంది…