ఏపిలో జ‌పాన్ భాష‌

japan-language-ap
ఏపిలో జ‌పాన్ భాష‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తొలి ద‌శ‌లో ప్ర‌స్తుత విద్యా సంవత్స‌రం నుంచే మూడు రీజియ‌న్ల‌లోని ఆంధ్ర‌, నాగార్జున‌, వెంక‌టేశ్వ‌ర విశ్వవిద్యాల‌యాల్లో జ‌ప‌నీస్ భాష‌ను అందుబాటులోకి తేనున్నారు. రానున్న రోజుల్లో నూత‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌పాన్ ప్ర‌భుత్వం..ఆ దేశ సంస్ధ‌లు విస్తృతంగా పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తున్నాయి. దీంతో..ఇక్క‌డి వారికి ఉపాధి అవ‌కాశాలు ఎక్కువ‌గా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. వీట‌న్నింటినీ దృష్టిలో ఉంచుకొని జ‌పాన్ భాష‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఏపి సీయం చంద్ర‌బాబు తన జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం మూడు వ‌ర్పిటీల్లో జ‌పాన్ భాష‌ను ప్ర‌వేశ పెడుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది..