ఏపి నూత‌న రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్

ap-capita-masterplan
ఏపి నూత‌న రాజ‌ధాని కోర్ క్యాపిట‌ల్ డిసైడ్ అయింది. పాల‌న‌లో కీల‌క‌మైన ప్ర‌భుత్వ కోర్ ఏరియా ను ఖ‌రారు చేసారు. సీడ్ క్యాపిట‌ల్ ను నాలుగు భాగాలుగా విభ‌జిస్తూ..మాస్ట‌ర్ ప్లాన్ డిజైన్ చేసారు. ఇందులో..లింగాయ‌పాలెంలో ప్ర‌భుత్వ కోర్ ఏరియాగా గుర్తించారు. ఉద్దండ‌రాయుని పాలెం ను డౌన్ టౌన్ ఏరియా గా గుర్తిస్తూ..మాస్ట‌ర్ ప్లాన్‌లో ప్ర‌స్తావించారు. ఇక‌..రెసిడెన్షియ‌ల్ జోన్ గా ఉండే అమ‌రావ‌తి గేట్‌వే గా తాళ్లాయ‌పాలెం ను ఖ‌రారు చేసారు. ఇక‌..నాలుగో భాగ‌మైన వాట‌ర్ ఫ్రంట్ ఏరియాగా ఈ మూడు గ్రామాల‌ను క‌లుపుతూ కృష్ణాన‌దికి అభిముఖికంగా రానుంది. అయితే..రాజ‌ధాని నిర్మాణాల‌న్నీ రివ‌ర్ ఫ్రంట్ నిర్మాణాలుగా చేప‌ట్ట‌నున్నారు. మొత్తం క్యాపిట‌ల్ సిటీలో ఈ నాలుగు భాగాలుతో కూడిన ఒక మెగా సిటీ.. ప‌రిస‌ర ప‌ట్ట‌ణాల‌తో ఏడు రీజ‌న‌ల్ కేంద్రాలు అభివృద్ది చేయ‌నున్నారు..