రైతు ఆత్మ‌హ‌త్య‌ల్లో తెలంగాణ రెండో స్థానం

shabbir-ali-comments-trs
రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై త‌మ‌వి త‌ప్పుడు లెక్క‌ల‌న్న కెసిఆర్ స‌ర్కారు ఇప్పుడు జాతీయ‌నేర‌న‌మోదు సంస్థ నివేదిక‌కు ఏం స‌మాదానం చెబుతార‌ని శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత ష‌బ్బీర్ అలీ ప్ర‌శ్నించారు.దేశంలో రైతు ఆత్మ‌హ‌త్య‌ల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉండ‌టం సిగ్గుచేట‌ని ఆయ‌న విమ‌ర్శించారు.కెసిఆర్ ప్ర‌భుత్వం రైతుల‌ను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేస్తోంద‌న్న ష‌బ్బీర్ రైతు రుణ‌మాఫీని పూర్తిగా విస్మ‌రించార‌ని ఆరోపించారు.ఇప్ప‌టి దాక రాష్ట్రంలో యాబై ఏళ్ళు పైబ‌డిన వారు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డితే ఇప్పుడు యువ‌రైతులు సైతం ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న తెలిపారు.