బోగస్కు చెక్ పెడదాం

kcr
భాగ్య నగరంలో బోగస్ ఓట్లను తొలగించడమే టార్గెట్ గా పెట్టుకుంది కేసీఆర్ సర్కారు. మొన్నటి సాధారణ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నేపధ్యంలో కొందరు రెండు రాష్ట్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి అటువంటి విధానానికి పకడ్బందీగా చెక్ పెట్టాలనుకుంటోంది ప్రభుత్వం. ఎన్నికల కమీషన్ ప్రకటించిన ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేయడాన్ని అందివచ్చిన ఆయుధంగా మలుచుకొనేందుకు సర్కార్ సిద్దమైంది.

జిహెచ్ఎం సి పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సెటిలర్ల ఓట్లు కీలకం.ఆధార్ తో ఓటర్ కార్డును అనుసంధానం చేయడం ద్వారా బోగస్ ఓట్లకు చెక్ పెట్టాలని సర్కార్ నిర్ణయించింది.హైద్రాబాద్ నగరం నుండే ఆధార్ ను అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు సిఎం కెసిఆర్.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జిహెచ్ఎంసి ఎన్నికలు ఈ డిసెంబర్ లో జరగాలి.జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహాణకు గాను వార్డుల పునర్విభజన ప్రక్రియ సాగుతోంది.2014 లో జరిగిన జనరల్ ఎన్నికల్లో జిహెచ్ఎంసి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపికి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకొంది.సెటిలర్ల ప్రభావం వల్లే టిడిపి విజయం సాధించిందనే అభిప్రాయంతో అధికారపార్టీ ఉంది.

హైద్రాబాద్ నగరంలోని బోగస్ ఓట్లు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. జిహెచ్ఎంసి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టున్న పార్టీ…ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఎక్కువ. నగరంలో సెటిలర్ల ఓట్లు..ఆయా పార్టీల గెలుపు ఓటములపై ప్రభావాన్ని చూపుతాయి.నిజానికి నగర జనాభాలో 66 శాతం ఓటర్లు ఉండాలి. కాని, నగరంలో జనాభా కంటే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు గుర్తించారు.ఈ మేరకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయనే అభిప్రాయంతో అధికారులు ఉన్నారు.దీనికి చెక్ పెట్టేందుకు ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ ను అనుసంధానం చేయాలని ఎన్నికల కమీషన్ నిర్ణయించింది.ఎన్నికల కమీషన్ ప్రకటన…తెలంగాణ ప్రభుత్వానికి అందివచ్చిన ఆయుధంగా కలిసి వచ్చింది.ఈ మేరకు హైద్రాబాద్ లోనే వందశాతం ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఆధార్ తో ఓటర్ గుర్తింపు కార్డును అనుసంధానం చేయడం వల్ల బోగస్ ఓట్లకు చెక్ పెట్టే అవకాశం ఏర్పడుతోంది. కాగా సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ కలిశారు. బోగస్ ఓట్లు, ఆధార్తో ఓటర్ ఐడీల అనుసంధానంపై ఇరువురు మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక బోగస్ ఓట్లను ఏరివేస్తే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రత్యర్థులను సులభంగా దెబ్బతీయవచ్చని అధికారపార్టీ భావిస్తోంది.

ఆధార్ తో ఓటరు గుర్తింపు కార్డును అనుసంధానం చేసుకోకపోతే…ఓటర్ల జాబితాలో పేరు తొలగించనున్నారు.ఆధార్ తో అనుసంధానం ఏ మేరకు అధికార పార్టీకి ప్రయోజనం కల్గిస్తోందో చూడాలి.