తెలంగాణా కాంగ్రెస్ కు మరో దెబ్బ…

DSతెరాస లో వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. విఫక్ష పార్టీల నేతలపై ఆపరేషన్ ఆకర్శ గులాబీ దళం కొనసాగిస్తూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ టీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావును కలవడం చర్చనీయాంశంగా మారింది. ఒకటి రెండు రోజుల్లో కార్యకర్తలతో డిఎస్ సమావేశం కాబొోతున్నారు. కాంగ్రెస్ ను వీడాలని డిఎస్ ఒక నిర్నయానికి వచ్చినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గత కొద్ది కాలంగా డిెఎస్ పార్టీ అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ రాకపోవడానికి కారణం రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ నే కారణమని డిఎస్ భావిస్తున్నారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కూడా డిఎస్ దూరంగా ఉంటున్నారు.

ఇక డిఎస్ గులాబీ దళం లో చేరడమే తరువాయి…ఆయనకు ఏ హోదా ఇస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి తనకున్న స్టేచర్ కు రాజ్యసభ కావాలని డిఎస్ గులాబీ అధిష్టానాన్ని అడుగుతున్నట్టు సమాచారం. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఆయన్ను ఎమ్మెల్సీగా పంపాలనుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ గా ఆయన్ను పంపాలనే యోచనలో ఉంది. నిజామాబాద్ నుంచి డిఎస్ కు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్‌ కూడా గట్టి క్యాండిట్ కోసం ఎదురు చూస్తోంది. డిఎస్ రాకతో ఆయన్నే ఎమ్మెల్సీగా బరిలోకి దింపాలనుకుంటోంది టీఆర్ఎస్.