‘బాహుబలి’ ప్రీమియర్ షో డీటెయిల్స్…

Baahubali-PM‘బాహుబలి – ది బిగెనింగ్’ అంటూ జూలై 10న తెలుగు , హిందీ, తమిళ్ ఇలా మూడు భాషలలో అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం. రాజమౌళి అండ్ టీం మూడేళ్ళుగా ఎంతో శ్రమించి తీసిన చిత్రం ఎప్పుడెప్పుడా వస్తుందా అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

రిలీజ్ దగ్గరపడుతున్న కొద్ది చిత్ర యూనిట్ రోజుకో ఆసక్తికరమైన న్యూస్ రిలీజ్ చేస్తూ సినిమా ఫై మరింత అంచలను పెంచుతున్నారు. ఈ చిత్ర హిందీ వెర్షన్ రైట్స్ ని బాలీవుడ్ టాప్ డైరెక్టర్ మరియు నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం బాహుబలి హిందీ వెర్షన్ స్పెషల్ ప్రీమియర్ షోని జూలై 9వ తేదీన ప్లాన్ చేసారు. ఈ ప్రీమియర్ షో కి బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్, హీరోస్ కూడా ఈ స్పెషల్ షోకి హాజరు కానున్నారని సమాచారం.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకున్న చిత్ర టీం త్వరలోనే తెలుగు ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ఇక ఇప్పటికే ఎంఎం కీరవాణి అందించిన మ్యూజిక్ అందరిని ఆకట్టుకుంది.