‘కన్నప్ప ‘ అవతారం లో మంచు విష్ణు..

Bhaktha-Kanappaఇప్పటి వరకు రొమాంటిక్, యాక్షన్ చిత్రాలతో అలరించిన మంచు విష్ణు త్వరలో ఓ భక్తీ చిత్ర కథ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారతదేశంలోని అన్నీ భాషల్లో ‘కన్నప్ప కథ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పరమశివుని మహాభక్తుడిగా పేరు పొందిన కన్నప్ప గురించి తెలియని తెలుగువాడుండడు. ఆయన భక్తికి తార్కాణమే శ్రీ కాళహస్తీశ్వరాలయం. శివుని పరమవీర భక్తునిగా పేరు పొందిన కన్నప్ప పాత్రలో యంగ్ అండ్ డైనమిక్ హీరో మంచు విష్ణు నటించనున్నారు. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ, హాలీవుడ్ స్టూడియో భాగస్వామ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని డా.మోహన్ బాబు తెలియజేశారు