‘రుద్రమదేవి’ సెన్సార్ రివ్యూ..

Rudramadevi Motion Posterఅనుష్క మెయిన్ రోల్ లో అల్లు అర్జున్ , రానా ముఖ్య పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘రుద్రమదేవి’. దర్శకుడు గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సబ్యులు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. గత కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ తో సతమవుతున్న గుణ శేఖర్ ఈ చిత్రం ఫై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ నెల 26 న విడుదల అవుతున్న ఈ చిత్రం ఫై ఇండస్ట్రీ కాక సినీ అబిమానులు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియోతో సినిమా పట్ల అంచనాలు పెరిగాయి. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మార్క్ సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్‍.