బొంబాయి సినిమాకు సీక్వెల్ ..

bombay-sequalసౌతిండియన్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం..కెరియర్లో ఎన్నో మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన గొప్ప డైరెక్టర్, అలాంటిది గత కొన్నేళ్లుగా సక్సెస్ లేక వెనుకంజలో ఉన్నాడు. ఆ మద్య ఓ భారీ మల్టీస్టారర్ సినిమా తీసేందుకు ప్లాన్ చేశాడు కానీ అది మద్య లోనే ఆగిపోయింది… దీంతో ఒకప్పటి తన కెరియర్ లోనే ఓ ఆణి ముత్యం లాంటి సినిమా అయిన బొంబాయి చిత్రానికి సీక్వెల్ తీయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడట… హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. అయిన కానీ ప్రేక్షకులను ఎంతో గానో ఆకట్టుకొని సూపర్ విజయం సాదించింది.

అంత సక్సెస్ ఇచ్చిన బొంబాయి సినిమాకు సీక్వెల్ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు మణిరత్నం. అందుకు తగినట్టుగా కథను కూడా తయారు చేస్తున్నాడట…. భారతీయ అబ్బాయి, పాకిస్థానీ అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపులు తిరుగుతుందనే దానిపై ఈ సీక్వెల్ మూవీ ఉండబోతోందట…. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అమ్మాయిని పాకిస్థాన్ నుంచే సెలెక్ట్ చేయాలని భావిస్తున్నాడట దర్శకుడు మణిరత్నం. ఇది ఎప్పుడు సెట్స్ ఫైకి వస్తుందని అనేది తెలియాల్సి ఉంది.