మహేష్ బాబు శ్రీమంతుడు పోస్టర్ రిలీజ్..

Mahesh-Srimanthuduమహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘శ్రీమంతుడు’. ఇప్పటికే ఈ చిత్రం ఫై సినీ ఇండస్ట్రీ లో అంచలను పెరిగిపోతున్నాయి. మిర్చి తర్వాత కొరటాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాగా , 1, ఆగాడు వంటి రెండు ఫ్లాప్స్ తర్వాత మహేష్ ఎంతో కసి తో నటిస్తున్న శ్రీమంతుడు చిత్రం ఫై బాగానే అబిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్ గత సినిమాల కంటే భిన్నంగా….అదిరిపోయేలా ఉండబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన న్యూ పోస్టర్ నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఈ పిక్ లో మహేష్ సైకిల్ ఫై అదిరిపోయే లుక్ లో కనిపించాడు. ఈ పోస్టర్ లో మాత్రం మహేష్ కొత్తగా కనిపిస్తున్నాడు.

ఇక ఈ చిత్రం మహేష్ బాబు అమ్మ పాత్రలో సుకన్య నటిస్తోంది. హీరోయిన్ గా శృతి హసన్ నటించగా బెంగాళి భామ..అంగానా రాయ్ మరో ముఖ్య పాత్రలో కనిపిస్తుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 17న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్