బాహుబలి రన్ టైం చూసి షాక్ కు గురివుతున్నారు…

bahubali-run-timeటాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి’. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేస్తున్నారు రాజమౌళి. ఈ నెల 31న రిలీజ్ చేయబోతున్న ట్రైలర్ ఫై కేవలం టాలీవుడ్ పరిశ్రమే కాక మిగతా కోలీవుడ్ , బాలీవుడ్ చివరకు హాలీవుడ్ పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

తాజాగా ఈ చిత్ర రన్ టైం 4 గంటల 40 నిమిషాలు ఉందని ఫిలిం నగర్ సమాచారం. ఏంటి అంత టైం..? అని ఆశ్చర్య పోతున్నారా..అంత ఆశ్చర్య పోనవసరం లేదు లెండి మీము చెప్పింది బాహుబలి రెండు బాగాలు కలిసి 4 గంటల 40 నిముషాలు. ఈ లెక్క న చూస్తే మొదటి భాగం 2 గంటల 20 నిముషాలు ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఇది ఎంత వరకు నిజం అనేది రాజమౌళి చెప్పేవరకు మనం నమ్మలేం..