సూర్య తో మరోసారి జతకట్టనున్న శృతి…

Surya-Srutiశృతి హసన్..కమల్ హసన్ కూతురిగా వెండి తెర కు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ..కెరియర్ మొదట్లో కాస్త తడ పడ్డ..పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ లో నటించి గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. ఆ చిత్రం తర్వాత వరుస అవకాశాలతో అటు బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ ఇలా వరుస భాషలలో నటిస్తూ బిజీ హీరోయిన్ అయిపొయింది.

తాజాగా ఈ అమ్మడు తమిళ్ స్టార్ సూర్య తో జత కట్టనున్నది. సూర్య నటించిన యుముడు 3 లో శృతి నటించబోతుంది. యుముడు 1, 2 పార్ట్ లలో నటించిన అనుష్క కూడా పార్ట్ 3 లో నటిస్తుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు- కొరటాల శివ చిత్రం లో నటిస్తుంది. అలాగే తమిళంలో విజయ్, అజిత్ ల సరసన నటిస్తుంది. సూర్య కూడా మనం ఫేం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో 24 అనే సినిమా చేస్తున్నాడు.