మరో డైరెక్టర్ ని వలలో వేసుకున్న నయన…

Nayana-Vignesh-Shivanనయనతార ఈ పేరు తెలియని సినీ అబిమాని ఉండడు..చేసినవి తక్కువ సినిమాలే అయిన అమ్మడి ప్రేమ వ్యవహారాలు మాత్రం చాల ఉన్నాయి. తమిళ హీరో శింబుతో ప్రేమాయణం సాగించిన ముద్దుగుమ్మ వారి మధ్య విభేదాలు రాగానే, నటుడు & డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమలో పడింది. పెళ్లి వరకు వెళ్ళిన ఈ ప్రేమాయణం ఎందుకో తెలియదు కానీ సడన్ గా బ్రేక్ అప్ అయ్యింది.

ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ గా సినిమాలు చేస్తూ మళ్లీ బిజీ హీరోయిన్ అయిపొయింది. తాజాగా మరో ప్రేమ వ్యవహారం తో వార్తలోకి ఎక్కింది. ఓ త‌మిళ ద‌ర్శకుడితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డిందనే వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ‘పోడాపోడి’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన విఘ్నేష్ శివన్‌తో నయనతార ప్రేమలో మునిగి తేలుతుందని వార్త ప్రచారం జరుగుతుంది. అంతే కాదు ఈ డైరెక్టర్ కు ఒక ఖరీదైన కారును కూడా కొనిచ్చిందని కోలీవుడ్ టాక్.

ప్రస్తుతం విజయ్ సేతుపతి సరసన విఘ్నేష్ డైరెక్షన్‌లోనే ‘నానుమ్ రౌడీ దాస్’ అనే సినిమాలో నయనతార నటిస్తోంది. ఇది ఏమయినా నయన ప్రేమ వ్యవహారం మాత్రం కోలీవుడ్ లో హల చల్ చేస్తుంది.