హీరో రామ్ ఎవరిని టార్గెట్ చేసాడు..?

hero-ram-targetప్రస్తుతం తెలుగు సినిమా లలో హీరోలు పంచ్ డైలాగ్స్ చెప్పటం , ఆ డైలాగ్స్ కాస్త వేరే హీరోని టార్గెట్ చేసే విధంగా ఉండడం చాల కామన్ అయిపొయింది. తాజాగా హీరో రామ్ నటిస్తున్న ‘పండగచేస్కో’ చిత్ర ట్రైలర్ లో రామ్ చెప్పిన ఓ డైలాగ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఆ డైలాగ్ ఎంటింటే…” ధైర్యం బ్లడ్‌లో ఉంటుంది, బాడీలో ఉంటుంది, ఫ్యామిలీలో ఉంటుంది, గుండెలో నుంచి వచ్చే దమ్ములో ఉంటుంది అని ఎదవ సొల్లు చెప్పటం నాకు ఇష్టం ఉండదు” అంటూ రామ్ వ్యంగ్యంగా చెప్పిన ఈ డైలాగ్ తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు అగ్రకథానాయకులను లక్ష్యంగా చేసుకొని చెప్పినట్లుగా వుందనే ఆ హీరోల ఫాన్స్ మండి పడుతున్నారు. ఉద్ధేశ్యపూర్వకంగా ట్రైలర్‌లో ఈ డైలాగ్‌ను చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పండగచేస్కో ట్రైలర్‌లోని డైలాగ్ ఎవరిని టార్గెట్ చేసి చెప్పలేదు. అంటూ వివరణ ఇచ్చాడు. కానీ ఫాన్స్ మాత్రం నమ్మడం లేదు.