రజినీకాంత్ తో గొడవకు దిగుతున్న విక్రమ్

Rajini-Vikramలింగా ఫ్లాప్ తర్వాత రజనికాంత్ ఏ చిత్రం చేస్తున్నాడు..? ఎవరి దర్శకత్వం లో నటిస్తున్నాడు..? దాని బడ్జెట్ ఎంత..? ఇలా అందరి మనసులో మిగిలిపోయాయి..వీటి అన్నిటికి త్వరలోనే అధికారికంగా సమాధానం చెప్పబోతున్నాడు రజనీకాంత్…

సౌత్ ఇండియన్ ఆల్‌టైం రికార్డ్ టాప్ గ్రాసర్ నిలిచిపోయిన ‘రోబో’.. సీక్వెల్ శంకర్ ఫైనల్‌గా ‘రోబో 2’కు రజనీని ఒప్పించాడు. గత కొంత కాలంగా ఈ సీక్వెల్ విలన్ పాత్ర కోసం అమీర్ ఖాన్, కమల హాసన్‌ను శంకర్ సంప్రదిస్తే వాళ్ళ నుండి సరయిన సమాధానం రాకపోవడం తో , తాజాగా విక్రమ్ ను అడగగా..విక్రమ్ ఈ పాత్ర కు ఒకే చెప్పాడని సమాచారం..

“ఐ” చిత్రం ఫ్లాప్ తో చేతులు కాల్చుకున్న శంకర్ ఈసారి రజని తో మరో పెద్ద హిట్ కొట్టి తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్నాడు. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రాన్ని అయ్యంగారన్ ఇంటర్నేషనల్ – లైకా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తాయని కోలీవుడ్ టాక్. ఆస్కార్ విన్నర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తాడని, త్వరలో ఈ మూవీ సంబందించిన సమాచారం అధికారికంగా తేలపునున్నారు.