దిల్ రాజు చేతికి ‘లయన్’..?

lion-nizamనందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘లయన్‌’. సత్యదేవ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రుద్రపాటి రమణారావు నిర్మాత. తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతోండగా.. ‘లెజెండ్‌’ అనంతరం రాధికా ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది. ఇప్పటికే మణిశర్మ అందించిన మ్యూజిక్ కి విశేష స్పందన వస్తుంది.

ఇక ఈ చిత్ర డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే.. ఏ చిత్రానికి అయిన నైజం ఏరియా కలెక్షన్స్ బాగా ప్రదానం. అలాంటిది బాలకృష్ణ విషయనికి వస్తే గత చిత్రాలు అయిన సింహ, లెజెండ్ రెండు చిత్రాలు కూడా నైజంలో అంతగా వాసులు చేయకపోవడం తో, ఇప్పుడు లయన్ చిత్ర రైట్స్ తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాకపోవడం తో చివరికి దిల్ రాజు తీసుకోవడానికి ముందుకు వచ్చాడని టాక్. దిల్ రాజు ఓ సినిమా ని డిస్ట్రిబ్యూషన్ చేస్తునాడు అంటే ఆ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఇండస్ట్రీ లో ఉంది. మరి లయన్ చిత్రం ఎంతవరకు దిల్ రాజు కు కలిసి వస్తుందో చూడాలి.