కన్నీరు పెట్టించిన సంపూర్నేష్ బాబు..

Kanniruఒక్క సినిమా తో తెలుగు ఇండస్ట్రీ ని షేక్ చేసిన బాబు సంపూర్నేష్ బాబు. ‘హృదయ కాలేయం’ చిత్రంతో బర్నింగ్ స్టార్ గా మారిన ఈ నటుడు తాజాగా దర్శకుడు స్టీవెన్ శంకర్ అలియాస్ సాయి రాజేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘కొబ్బరిమట్ట’ చిత్రం లో నటిస్తున్న సంగతి తెల్సిందే.

సంపూర్నేష్ బాబు లో ఓ నటుడు మాత్రమే ఉన్నాడని తెలుసు. తాజాగా ‘కొబ్బరిమట్ట’ చిత్రం తో తనలో ఓ గాయకుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఈ చిత్రం లో సంపు స్వయంగా ఓ పాట పాడి అందరి చేత కన్నీరు పెట్టించాడు. సంపు మొదటిసారిగా పాడిన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న గాయకుడిగా పాడి అందర్ని ఆశ్చర్యపరిచాడు.

ఆతి త్వరలో రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షేకులను అలరించడం ఖాయం అని చెప్పడం లో ఎంటువంటి సందేహం లేదు. తాజాగా రిలీజ్ చేసిన ఈ సాంగ్ మేకింగ్ యుట్యూబ్ హల్ చల్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఈ సాంగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అబిమానులు తమ అబిమానాన్ని చాటుకుంటున్నారు.

అంతేకాకుండా సింగం 123 అనే చిత్రం లో ఓ పవర్ ఫుల్ ఆఫీసర్ రోల్ లో సంపు కనిపించబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ సాంగ్ మేకింగ్ వీడియో చూసి ఎంజాయ్ చెయ్యండి.