చిరు సాంగ్ కు స్టెప్స్ వేయబోతున్న అక్కినేని హీరో..

Naga-Chaitanyaతెలుగు సినిమాలలో ఈ మద్య రీమిక్స్ సాంగ్స్ హడా విడి బాగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.. సూపర్ హిట్ అయిన పాత చిత్రాల సాంగ్స్ రీమిక్స్ చేసి సూపర్ హిట్ సక్సెస్ ని సొంతం చేసుకుంటున్నారు కుర్ర హీరోలు. తాజాగా నాగచైతన్య చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ కు స్టెప్స్ వేయబోతున్నాడట. తను నటించిన ‘దోచేయ్’ చిత్రం లో చిరు సూపర్ హిట్ మూవీ అయిన ‘సంఘర్షణ’ లోని ‘కట్టు జారిపోయిందే’ అనే పాటను రీమిక్స్ చేయనున్నారని సమాచారం.

ఈ చిత్ర ఆడియోని ఈ నెల 11న విడుదల చేయనునట్లు నిర్మాతలు ప్రకటించారు. తాజాగా విడుదల అయిన టీజర్ లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం తో సినిమా కూడా అందరిని అలరిస్తుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకం తో ఉన్నారు.

నాగచైతన్య జంటగా కృతిసనన్ నటించగా, స్వామి రారా ఫేం సుదీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్నీ సంగీత దర్శకుడు.