కష్టాలు తప్పని ‘కమల్ హసన్’…

uthama_villain-Postponedదశ అవతారుడు, లోక నాయకుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హసన్ కి సినిమా కష్టాలు తప్పడం లేదు. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఉత్తమ విలన్ ‘ చిత్ర రిలీజ్ మరో 3 వారాల పాటు వాయుదా పడే అవకశం కన్పిస్తుంది.

ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచే గ్రాఫిక్ వర్క్ ఆశించిన రేంజ్‌లో రాకపోవడం తో మరో సారి చిత్ర యూనిట్ గ్రాఫిక్ వర్క్స్ చేసే పనిలో పడ్డారని న్యూస్ కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. అన్నీ అనుకూలిస్తే ఈనెల చివరి వారం లో లేదా మే 1న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారట. ముందుగా ఈ చిత్రాన్ని ఈ నెల 10న విడుదల చెయ్యలని అనుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు లో సి. కళ్యాణ్ రిలీజ్ చేయడం జరుగుతుంది.