మెగా హీరో ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ…

hemaకామెడీ నటిగా పేరు తెచ్చుకున్న హేమ తాజాగా మెగా నాగబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలో నిలిచింది. ఈ నెల 29న జరగనున్న ‘మా ‘ ఎలక్షన్స్ లో పోటి పడుతున్న జయసుధ కు మద్దతుగా నటి హేమ మాట్లాడుతూ… గతంలో మా అధ్యక్షుడిగా వున్న నాగబాబు, మా అసోసియేషన్‌కి ఏం చేసిపెట్టారని , ఇప్పుడే ఏ కారణంతో రాజేంద్ర ప్రసాద్ కు మద్దతు పలుకుతున్నారని ఘాటుగా నిలిదిసింది హేమ…

నాగబాబు ప్రెసిడెంట్‌గా వున్నటైం లో ‘మా ‘ కోసం ఏమీ ఒరిగింది లేదని, ఇప్పుడు మరో వ్యక్తిని బలపర్చడంలో అర్థం లేదని అన్నది. ఏది ఏమయినా ఓ పెద్ద ఫ్యామిలీ లో ఒకరిని ఇలా అనడం ఆమె భవిష్యత్ కు మంచిది కాదని కొందరు అంటున్నారు. మరి దీనిఫై నాగబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.