మే 15 న విడుదల కానున్న ‘బాహుబలి పార్ట్ 1’

Bahubali-release-dateప్రభాస్ అబిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బాహుబలి పార్ట్ 1’ విడుదల తేదిని ప్రకటించారు. మే 15న బాహుబలి మొదటి పార్ట్ ని విడుదల చేయనునట్లు దర్శక ధీరుడు రాజమౌళి ట్విట్టర్ తెలిపాడు. రెండు ఏళ్లుగా యూనిట్ సబ్యులు అందరు ఎంతో కష్టపడి తీసిన ఈ చిత్రానికి ఈరోజు విడుదల తేది ప్రకటించే ముహూర్తం కుదిరిందని చెప్పకొచ్చాడు.

భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం, ప్రస్తుతం మొదటి భాగానికి సంబధించిన టాకీ పార్ట్ కూడా పూర్తి అవడం తో యూనిట్ సభ్యులు ఆనందం తో ఉన్నారు. మిగిలిన రెండవ భాగం ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేయడం జరుగుతుంది.

ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా వంటి పెద్ద స్టార్స్ నటించిన ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైందని తెలియడం తో అభిమానులు సంతోషంనికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటికే ఈ చిత్ర ఫై సామన్య ప్రేక్షకుడితో పాటు సినిమా పరిశ్రమ సైతం ఎంతగానో ఎదురు చూస్తుంది. కీరవాణి స్వరపరిచిన పాటలను ఏప్రిల్‌ చివరి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.