50 కోట్ల క్లబ్ లో ఎన్టీఆర్ చేరతాడా ..?

NTR-Temper-50crఇది మీము అంటున్న ప్రశ్న కాదు.. నందమూరి అబిమానులు అంటున్న ప్రశ్న.. ఎప్పటి నుండో వారు కోరుకుంటున్న కోరిక అది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేత వయసులోనే రికార్డులను బద్దలు కొట్టి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు. గతకొంత కాలంగా సరైన విజయాలు లేక రేసులో వెనుకబడ్డాడు. ఇక బాబాయ్ బాలకృష్ణ సైతం ఇప్పటి హీరోలతో తను ఏ మాత్రం తక్కువ కాదు అంటూ లెజెండ్ చిత్రం తో 50కోట్ల క్లబ్ లో చేరి నిజంగానే లెజెండ్ అనిపించుకున్నాడు.

అలాగే మెగా ఫ్యామిలి హీరోలు సైతం అవలీలగా 50కోట్ల చిత్రాల లిస్టు లో చేరిపోతున్నారు. ఎన్టీఆర్ మాత్రం ఇంకా ఆ దరిదాపుల్లో లేకపోవడంతో నందమూరి అభిమానులు కాస్త నిరాశగానే ఉన్నారు. కానీ ఈసారి ‘టెంపర్’ తో వారి కోరిక తీరబోతుందని ట్రెండ్ వర్గాలు చెపుతున్నాయి.

ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ డే 9 కోట్ల 70 లక్షలు కలెక్ట్ చేసి టాప్ 10 ఫస్ట్ డే కలెక్షన్ చిత్రాలలో మూడో స్థానంలో నిలిచింది. ఈ టాప్ 10 లిస్ట్‌లో నాల్గు చిత్రాలున్న ఏకైక స్టార్‌గా ఎన్టీఆర్ రికార్డ్ క్రియేట్ చేసాడు. అప్పడెప్పుడో రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన సింహాద్రి చిత్రం తోనే ఎన్టీఆర్ 50 కోట్ల క్లబ్ లో చేరతాడు అని వార్తలు వచ్చాయి కానీ అది మిస్ అయ్యింది.

అప్పటి నుండి ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ కి టెంపర్ రూపం లో 50 కోట్ల క్లబ్ లో చేరే అవకశం వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలయిన అన్ని సెంటర్స్ లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సునామి సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఏ రౌండ్ 20 కోట్ల వరకు కలెక్షన్స్ రావోచ్చునని చెపుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ సారి ఎన్టీఆర్ 50 కోట్ల మార్క్ చేరబోతున్నాడు.