రామ్ చరణ్ కొత్త ప్రయోగం..

Charan-Anirudh-Movieఇప్పటి వరకు రామ్ చరణ్ చేసిన అన్ని సినిమాలకు మ్యూజిక్ బాగా హెల్ప్ అయ్యిందని చెప్పవచ్చు. అలాంటిది తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయబోయే చిత్రానికి ‘కొలవేరి డి’ ఫేం అనిరుధ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నాడు. ఇప్పటి వరకు అనిరుధ్ తెలుగు లో సంగీతం వహించిన చిత్రాలు ఏమీలేవు. అయిన కానీ చరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఫై అబిమానులు కాస్త కోపంగా ఉన్నారని టాక్.

ఇక ఈ చిత్రం లో మొదటిసారి చరణ్ కు జోడిగా సమంత నటిస్తుంది. యూనివర్సల్ మీడియా పతాకంపై నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నారు. కోన వెంకట్, గోపి మోహన్ లు స్క్రిప్ట్ అందిస్తున్నారు.