‘గబ్బర్ సింగ్ 2 ‘ డైలాగ్ రైటర్ గా పవన్ అబిమాని..

Gabbar-Sing-Konaఎంతో కాలంగా అబిమానులను ఊరిస్తువస్తున్న గబ్బర్‌సింగ్ సీక్వెల్ ఈ ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. గబ్బర్‌సింగ్ చిత్రం పవన్ కెరియర్ లోనే ఓ మైలు రాయి గా నిలిచిపోవడం తో ఇప్పుడు సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. దాదాపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కావచ్చిన ‘గబ్బర్‌సింగ్- 2’ కి డైలాగ్ రైటర్ గా పవన్ అంటే ఎంతో అబిమానం ఉన్న కోన వెంకట్ డైలాగ్స్ రాస్తున్నట్లు సమాచారం. గతంలో పవన్ సినిమాకి దర్శకత్వం చేద్దాం అనుకున్న కోన ఆ కోరిక తీరలేదు.. తాజాగా డైలాగ్స్ రాసే అవకశం రావడంతో చాల ఆనందంగా ఉన్నాడని వార్త.

పవన్ సన్నిహితమిత్రుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియాస్ జానకి ఫేమ్ అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తుంది.