రానా భవిష్యత్ ఆ సినిమా ఫైనే..

ranaలీడర్ చిత్రం తో తెలుగు తెర ఫై తెరంగేట్రం చేసిన దగ్గుపాటి రానా..మొదటి సినిమా తోనే విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఆ తరవాత ఒకటి రెండు సినిమాలు తెలుగు లో చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో రానా బాలీవుడ్ దారి పట్టాడు..కానీ అక్కడ కూడా మనోడో సక్సెస్ కాలేకపోయాడు.

తాజాగా ఇప్పుడు ఈ ఆరున్నర అడుగుల హీరో ‘బాహుబలి’ సినిమా ఫై కొండంత ఆశలు పెట్టుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రానున్న ప్రతిష్టాత్మక ఈ చిత్రం లో లైఫ్‌ టైమ్‌ బెస్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నానని చెపుతున్నాడు రానా . ‘బాహుబలి’ సినిమాపై ఇండియా అంతటా చాలా ఆసక్తి గా ఎదురుచుస్తుందని , ఈ సినిమాలో నేను , ప్రభాస్ పోటాపోటీగా నటించమని చెపుతున్నాడు.అంతే కాకుండా తమిళంలో కూడా రానా ఓ సినిమా చేశాడు. తాజాగా మరోసారి బిపాషా బసు తో కలిసి నటించబోతున్నాడు.