బాలకృష్ణ మేనేజర్ కిడ్నాప్‌…

nbk-lionనూతన దర్శకుడు సత్యదేవ దర్శకత్వంలో లో బాలకృష్ణ, త్రిష, రాధిక ఆప్టే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లయన్’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకుంటుంది. సోమవారం చిత్ర యూనిట్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. రామోజీ ఫిలింసిటీలో సినిమా షూటింగ్ జరుగుతుండగానే అక్కడికొచ్చిన ఓ ట్రావెల్స్ ఏజెన్సీ మనుషులు.. లయన్ సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తున్న దిలీప్ సింగ్, క్యాషియర్ రాఘవ చంద్రలని కిడ్నాప్ చేశారు. క్యాషియర్ రాఘవచంద్ర ఎలాగోలా తప్పించుకోగలిగాడు. యూనిట్ సభ్యుల ఫిర్యాదు మేరకు అలెర్ట్ అయిన పోలీసులు వనస్థలిపురం వద్ద రోడ్ పై చెకింగ్ నిర్వహించి అటుగా వస్తున్న కిడ్నాపర్ల కారుని ఆపి మేనేజర్ ని రక్షించారు. అనంతరం నిందితులు అక్బర్, ఇమ్రాన్ ఖాన్, ఖాదర్ షరీఫ్, జీసంత్ ఖాన్ లని అరెస్ట్ చేశారు.