వింటర్ సీజన్ ముగిసింది..

ys-jagan-vs-babu
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి (మంగళవారం)తో ముగిశాయి. ఉదయం ప్రశ్నోత్తరాల సందర్భంగా సాగర్ కాల్వ ఆధునికీకరణ, తదితర అంశాలపై చర్చించారు. కొల్లేరును మూడు కాంటూరుకు కుదించాలన్న తీర్మానంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తర్వాత రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చంద్రబాబు ప్రకటన చేశారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.

అంతకుముందు.. కొల్లేరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో.. కొల్లేరులో బాంబులు, పొక్లెయిన్లతో చెరువులను ధ్వంసం చేశారని అన్నారు. దీంతో… ప్రజలు భయాందోళనకు గురయ్యారన్నారు. కొల్లేరు కాంటూర్ కుదింపుపై సాధికార కమిటీ ఉందని, అవసరమైతే నిపుణుల కమిటీ వేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.కొల్లేరు ప్రాంతంలో ప్రజలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు