కొత్త ప్రియురాలిని పట్టిన రానా

rana-kajalదగ్గుపాటి రానా.. టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన రామానాయుడి గారి మనవడు గా చిత్ర సీమా కు లీడర్ సినిమా తో తెరగేట్రం చేసాడు. తెలుగు లో ఈ అందగాడు చేసిన చిత్రాలు తక్కువే కానీ హీరోయిన్స్ తో ప్రేమాయ‌ణం సాగించింది చాల ఎక్కువే. ఇతగాడి ప్రేమలో పడిన హీరోయిన్స్ లిస్ట్ చాల పెద్దవే. తాజాగా మరో అగ్ర హీరోయిన్ ఇతగాడి ప్రేమలో పడి మునిగితేలుతుందట. ఇంతకి ఎవరా ఆ హీరోయిన్ అనుకుంటున్నారా.. ? లక్ష్మి కళ్యాణంతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్, ప్రస్తుతం రానా తో ప్రేమ ప్రయాణం సాగిస్తుంది అనే వార్త ఫిలిం నగర్ లో వినపడుతుంది.

అటు రానాపై, ఇటు కాజ‌ల్‌పై ఇది వ‌ర‌కు చాలాసార్లు ఇలాంటి గాసిప్పులు వినిపించాయి. బిపాసాబ‌సుతో రానా ప్రేమాయ‌ణం సాగిస్తున్నాడ‌ని కొన్నాళ్లు చెప్పుకొన్నారు. ఆ త‌ర‌వాత త్రిష వ‌చ్చి చేరింది. ఇప్పుడు కాజ‌ల్ పేరు త‌గిలించారు. కాజ‌ల్‌కీ ఇలాంటి వార్త‌లు కొత్త‌కాదు. కాజ‌ల్‌కి పెళ్లి కుదిరింద‌ని, ఓ వ్యాపార వేత్త‌తో నిశ్చితార్థం కూడా జ‌రిగిపోయింద‌ని చెప్పుకొన్నారు. వీటికి కూడా కాజ‌ల్ ప‌లుమార్లు స‌మాధాన‌మిచ్చింది. రానా, కాజ‌ల్ క‌ల‌యిక‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. క‌నీసం యాడ్‌లోనూ న‌టించ‌లేదు. మ‌రి వీరిద్ద‌రికీ ఎలా జోడీ కుదిరిందో ఏంటో..? ఈమ‌ధ్య రెస్టారెంట్ల‌లోనూ, ప్రైవేటు పార్టీల్లోనూ ఇద్ద‌రూ జాయింటుగా క‌నిపిస్తున్నార‌ట‌. దీంతో రానా, కాజల్ ప్రేమాయణం సాగిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజం అనేది వాళ్ళ నోరు విప్పితే కానీ తెలియదు.