ప్రధానితో ఇద్దరు చంద్రుల భేటీ !

KCR-Modi-Chandra-Babu
సై అంటే సై అంటూ ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటుంటారు ఇద్దరు చంద్రులు. వారే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. రాష్ట్ర విభజన అనంతరం కూడా వీరి మధ్య కౌంటర్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రులిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా వుంటుంది..? అదీ.. కూడా ప్రధాని మోడీ ఆధ్వర్యంలో అయితే ఇంకేలా వుంటుంది..?? చూడాలి వుంది కదూ.. ! ఇది నిజం కానుంది. ఈ నెల 7వతేదిన మోడీ ఆధ్వర్యంలో.. చంద్రలిద్దరూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ నెల 7వ తేదిన ప్రణాళిక సంఘం ప్రధాని అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి హాజరుకావడానికి చంద్రబాబు, కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే.. మోడీ సమక్షంలో.. చంద్రలిద్దరూ మాట్లాడుకునే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.

టీ-ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 5వ తేదిన ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నాడు. పలువురు కేంద్ర మంత్రులు, ప్రధానితో కేసీఆర్ భేటీ కానున్నారు. ప్రాణహిత చేవెళ్ల, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కరెంట్ కష్టాలు.. తదితర అంశాలను కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావించే అవకాశాలున్నాయి. మొత్తానికి.. ఢిల్లీ టూరులో.. చంద్రలిద్దరూ మోడీతో సమావేశం కావడం హైలెట్ కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.