రవితేజతో తమ్మూ రొమాన్స్.. !

raviteja-tamanna
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా దర్శకుడు సంపత్ నంది ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. స్క్కిప్టును పూర్తిచేసే పనిలో వున్నాడు సంపత్ నంది. ప్రస్తుతం రవితేజ ‘కిక్ -2’ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తవ్వగానే సంపత్ నందితో మూవీ మొదలవ్వనుంది. తాజాగా, ఈ చిత్రం
గురించి మరో విషయం బయటకు పొక్కింది. ఈ చిత్రంలో రవితేజతో తమన్నా రొమాన్స్ చేయనుందట. సంపత్ నంది ’రచ్చ’లో తమ్మూ అందాల రచ్చ చేసింది. రవితేజతో జతకట్టడం తమ్మూకి ఇదే తొలిసారి. మరీ.. వీరి రొమాన్స్ ఏ రేంజ్ లో వుంటుందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.