మిస్ ఇండియా టైటిల్ కొద్దిలో మిస్ చేసుకున్న అందాల తార రకుల్ ప్రీతిసింగ్ ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లకు పోటీ కానుందా అంటే అనుననే అంటున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో తెర మీదకు వచ్చిన అమ్మడు మాంచి హిట్‌నే అందుకుంది. తెలుగులో సోలో హీరోయిన్గా తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్న రకుల్ అందానికి అందం, ఒడ్డు పొడుగు, సెక్సప్పీల్ ఉన్న నాయికగా పేరు తెచ్చుకుంది. మొదటి సినిమా హిట్ కావటవతో అవకాశాలు వెల్లువలా తన్నుకుని వచ్చాయి…ఇప్పటికే అమ్మడి చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి.
తాజాగా ‘లౌక్యం’ హీరో గోపిచంద్ సరసన పొగరుబోతు చంద్రకళగా నటించి మంచి మార్క్స్ కొట్టేసింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ 2 చిత్రం లో హీరొయిన్ గా సెలెక్ట్ అయ్యిందని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. ముందు ముందు పెద్ద హీరోల సరసన నాయికగా అవకాశాలు అందుకునే ఛాన్సుందని అంటున్నారు. ఇదే జరిగితే పెద్ద హీరోయిన్లకు పోటీగా వచ్చిన ఆశ్చపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం రవితేజతో కిక్ 2, ఆదితో ‘రఫ్’, మనోజ్‌తో ‘కరెంటు తీగ’, రామ్‌తో ‘పండుగ చేస్కో’ సినిమాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు విజయం సాధిస్తే ఇక అమ్మడు స్టార్ హీరోయిన్‌తో పాటు…గ్రాఫ్ అమాంతం పెరిగిపోనుంది.