విలన్ రోల్ కు రెడీ అంటున్న దగ్గుపాటి హీరో

rana-daggubatiతనకు క్యారెక్టర్ నచ్చితే టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు విలన్ రోల్ చేయడానికి సిద్ధమంటున్నాడు హీరో రానా దగ్గుబాటి. బేగంపేటలోని ది హిందు పత్రిక కార్యాలయంలో శనివారం ‘ది హిందు బ్రైడల్ మంత్ర 2014’ 5వ ఎడిషన్ మేగజైన్‌ను రానా విడుదల చేశారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం లో బాహుబలి చిత్రం లో నటిస్తున్నాని,వచ్చే వేసవిలో బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంది. సెకండ్ పార్ట్ 2016 వరకు పూర్తవుతుందని ఆశిస్తున్నా. కథ, కథనం రెండూ నచ్చితే బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తున్నాను’ అని రానా తెలిపాడు. నీరజ్ పాండే దర్శకత్వంలో అక్షయ్ కుమార్, రానా హీరోలుగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ‘బేబీ’ వచ్చే ఏడాది జనవరి 23న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.