కైలాస్ సత్యార్థి, మలాలకు నోబెల్ పురస్కారం

Inida-pak-now-share-a-noble
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం – 2014 ను రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. భారత్ కు చెందిన బాలల హక్కుల కార్యకర్త కైలాస్ సత్యార్థి, పాకిస్థాన్ బాలిక మలాల యూసఫ్ జాయ్ కు నోబెల్ శాంతి పురస్కారం సంయుక్తంగా లభించింది. ‘బచ్ పన్ బచావో ఆందోళన్’ సంస్థ నిర్వాహకుడైన సత్యార్థి… నోబెల్ పురస్కారానికి ఎంపికైన ఏడవ భారతీయుడు. తీవ్రవాద కాల్పుల్లో గాయపడినా.. మొక్కవోని ధైర్యంతో బాలికల విద్యకోసం నిధులు సేకరిస్తూ.. మలాలా హక్కుల కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. పదిహేడేళ్ల వయసులోనే నోబెల్ శాంతి పురస్కారం పొందిన వ్యక్తిగా మలాలా రికార్డు సృష్టించింది.

ఇప్పటి వరకు నోబెల్ శాంతి పురస్కారాన్ని గెలుచుకున్న భారతీయుల వివరాలు :

* 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ – సాహిత్యంలో నోబెల్ పురస్కారం
* 1930లో సర్ సీవీ రామన్ – భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం
* 1968లో హర్ గోవింద్ ఖొరానా – వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం
* 1979లో మదర్ థెరెస్సా – నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.
* 1983లో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ – భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం
* 1998లో అమర్త్యసేన్ – అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం
* 2014లో శాంతి బహుమతి కైలాష్ సత్యార్థి అందుకోనున్నారు.