కథ రెడీ

puri-mahesh-babuపూరీ-మహేష్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు పూరీ నే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా, కథ కూడా రెడీ అయిపోయిందట. మహేష్ కోసం.. ఓ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా కథను సిద్ధం చేశాడట పూరీ. మహేష్ కు వినిపించడమే తరువాయి. మహేష్ ఓకే అంటే.. కొరటాల శివ చిత్రం తరవాత ప్రిన్స్ చేసే చిత్రం ఇదే అవుతోంది. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ చిత్రంతో, పూరీ ఎన్టీఆర్ చిత్రంతో బిజీగా వున్నారు. మహేష్-పూరీ హ్యాటిక్ మూవీ వచ్చే యేడాది సెట్స్ కి వెళ్లొచ్చన్నది టాలీవుడ్ టాక్.